వాళ్లెవరూ విషెస్ చెప్పలేదు కాని..

Update: 2018-01-29 11:15 GMT
మెగా మథర్ కి బెస్ట్ విషెష్మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలిలో ఎటువంటి వేడుక జరిగిన చాలా కోలాహలంగా ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో మాత్రం కొన్ని వేడుకలకు కుటుంబంలోని వారు దూరంగా ఉండక తప్పడం లేదు. కారణం మరేదో కాదు. ప్రస్తుతం యువ హీరోలందరూ షూటింగ్ లలో బిజీగా ఉండటం వల్ల చిన్న చిన్న వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే..ఈ రోజు మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి పుట్టినరోజు.

అయితే ఆమె పుట్టిన రోజు అందరు బిజీగా ఉన్నారు. కానీ ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా మెగా స్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ కానుగంటి మాత్రం మెగా మథర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రామ్ చరణ్‌ అండ్ వరుణ్‌ తేజ్ కూడా తమ నానమ్మకు ఇంతవరకు విషెస్ చెప్పలేదు కాని.. కళ్యాణ్‌ మాత్రం అమ్మమ్మా అంటూ భలే చెప్పాడు. హ్యాపీ బర్త్ డే అమ్మమ్మా అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటోని కూడా పోస్ట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు కూడా విషెస్ అందిస్తున్నారు. ఒక ప్రక్కనే మెగా హీరోలే బిజీగా ఉన్న టైములో ఇలా అల్లుడు విషెస్ చెప్పడం.. కాసింత క్రిటిసిజంకు కూడా దారితీసిందిలే.

ఇకపోతే కళ్యాణ్ త్వరలో ఒక సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్ర సమర్పణలో సాయి కొర్రపాటి సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News