• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజువల్స్ వావ్ కానీ -...

విజువల్స్ వావ్ కానీ - టీజర్ టాక్

By - Tupaki Desk
Update: 2019-03-12 10:33 GMT
బాలీవుడ్ లో ఈ ఏడాదివస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్స్ లో ఒకటి కళంక్. కరణ్ జోహార్ తో మరో ముగ్గురు అగ్ర నిర్మాతలు అసోసియేట్ అవుతూ తీసిన ఈ మల్టీ స్టారర్ కు అభిషేక్ వర్మన్ దర్శకుడు. దీని ట్రైలర్ ఇందాక విడుదల చేశారు. కథ ఎక్కువ రివీల్ చేయకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు రిచ్ నెస్ ని హై లైట్ చేసే ప్రయత్నం గట్టిగా చేశారు. అర్థమైనంత వరకు కథ విషయానికి వస్తే ఇది ఇప్పటి చరిత్ర కాదు.

ఎప్పుడో స్వతంత్రం రాక ముందు ఓ రాజుల వంశానికి చెందినది. అనగనగా ఒక పెద్ద రాజ భవనం. దానికో చక్రవర్తి. మహారాణి ఉంటుంది. రాకుమారి తో పాటు యువరాజు కూడా కొలువుంటాడు. ఏదో కుట్ర. ఏదో సంఘర్షణ. బయటికి కనిపించని అంతర్యుద్ధంతో లోపల దావనలం మొదలవుతుంది. అంతు చిక్కని మలుపులతో వీళ్ళ జీవితాలకు కఠిన పరీక్ష ఎదురవుతుంది. అసలు ఏం జరిగింది ఎవరు ఎందుకు కళంకితులు అయ్యారనేదే అసలు కథ

ట్రైలర్ ఆసాంతం భారీతనం కొట్టొచ్చినట్టు కనపడింది. రాజీ ప్రస్తావనే లేకుండా సబ్జెక్టు డిమాండ్ చేసినంత మేర ఖర్చు పెట్టారు. సంజయ్ దత్-మాధురి దీక్షిత్-వరుణ్ ధావన్- అలియా భట్-సోనాక్షి సిన్హా-ఆదిత్య రాయ్ కపూర్ ఇలా మోస్ట్ వాంటెడ్ స్టార్లందరూ రిచ్ నెస్ ని తీసుకొచ్చారు. హంగామా బాగుంది కాని అసలైన ఫీల్ ని మాత్రం ఇందులో కలిగించలేక పోయారు. స్లోగా డల్ గా అనిపించే మూడ్ లో ట్రైలర్ కట్ చేయడం వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉందేమో.

గ్లాడియేటర్ బాహుబలి తరహలో వరుణ్ ధావన్ ఓ కాకలు తీరిన దున్నపోతుతో పోరాడే సన్నివేశం తప్ప ఇంకే యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించలేదు. ఇది ఎక్కువ శాతం ఎమోషన్స్ మీద ఆధారపడి తీసినట్టు ఉంది. అంచనాలు అమాంతం పెంచేలా లేకపోయినా ఫైనల్ గా పర్వాలేదు అనిపించేలాగే ఉంది. తొలుత ఫిక్స్ చేసిన ఏప్రిల్ 19 కాకుండా రెండు రోజులు ముందుకు జరిపి ఏప్రిల్ 17న కళంక్ విడుదల కానుండటం విశేషం

Full View

Tags:    
  • Kalank Official Teaser 
  • Varun Dhawan 
  • Aditya Roy 
  • Sanjay Dutt 
  • Alia Bhatt 
  • Sonakshi Sinha 
  • Madhuri Dixit 
  • Abhishek Varman 
  • telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS