హైద‌రాబాద్ చెన్న‌య్ లో కాజ‌ల్ వివాహ రిసెప్ష‌న్

Update: 2020-11-09 08:10 GMT
చంద‌మామ చూస్తుండ‌గానే ఓ ఇంటిదైపోయింది. ఏడాదిగా బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుతో ప్రేమాయ‌ణంపై ఎలాంటి క్లూ ఇవ్వ‌ని కాజ‌ల్ ఉన్న‌ట్టుండి త‌న ప్రియుడిని పెళ్లాడేస్తున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చింది. ఆ త‌ర్వాత అంతా చ‌క‌చ‌కా అయిపోయింది. ప్ర‌స్తుతం పెళ్లితో ఓ ఇంటిద‌యిపోయింది. సొంత ఇంటి నిర్మాణం సాగుతోంది. ఇందులోనే కాపురం పెట్టేసేందుకు కాజ‌ల్ - గౌత‌మ్ జంట స‌ర్వ స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు మాల్దీవులలో హనీమూన్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. అట్నుంచి తిరిగి వచ్చిన తరువాత కొత్త జంట చెన్నై హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్లు నిర్వహించాలని భావిస్తున్నార‌ట‌.

పెళ్లికి సినీ స‌హ‌చ‌రులెవ‌రూ అటెండ్ కాలేదు క‌దా రిసెప్ష‌న్ల ప్లాన్ ఎలా ఉంది? అన్న ప్ర‌శ్న‌కు కాజ‌ల్ నుంచి స‌మాధానం వ‌చ్చింది. హైదరాబాద్ .. చెన్నైలోని తన సినీ పరిశ్రమ సహచరుల కోసం భారీగా విందు ఏర్పాటు చేయాల‌ని కాజ‌ల్ అన్నారు. తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమలకు రెండు వేర్వేరు వివాహ రిసెప్షన్ పార్టీలు ఉంటాయని తెలిపారు. కాజ‌ల్ కి తెలుగు.. త‌మిళ రాష్ట్రాల్లోనే అప‌రిమితంగా అభిమానులు ఉన్నారు. త‌న కెరీర్ జ‌ర్నీ లైఫ్ అంతా ఇక్క‌డే ముడిప‌డి ఉంది. అందుకే ఇక్క‌డ ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుల‌కు ఘన‌మైన విందును ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. ఈ రిసెప్ష‌న్ కు టాప్ స్టార్లు స‌హా టాప్ టెక్నీషియ‌న్లు ఎటండ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

అలాగే పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ సెల‌బ్రేష‌న్స్ గురించి తెలిసిందే. ఇంత‌కుముందు ఎర్రటి ట్రంప్ శారీలో కార్వా చౌత్ వేడుకలు నిర్వ‌హించిన‌ కాజ‌ల్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. బాలీవుడ్ నాయిక‌ల్లో చాలా మంది ఈ ఉప‌వాస ఆచారాన్ని పాటించారు. ధీక్ష‌ల‌తో క‌నిపించారు. ప్రియాంక చోప్రా.. శిల్పా శెట్టి కుంద్రా .. కాజోల్ సహా పలువురు బాలీవుడ్ తారలు ఈ పండుగను ఉత్సాహపూరితమైన రెడ్ లుక్ లో జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిన‌దే. ముంబైలో కాజ‌ల్ ఈ వేడుక‌ను జ‌రుపుకోగా.. అక్క‌డ కుటుంబ స‌భ్యుల‌కు విందు కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు.
Tags:    

Similar News