కాజ‌ల్ కిచ్లు దంప‌తుల కొత్త వ్యాపారం 'కిచ్డ్'..!

Update: 2020-12-22 06:45 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్ ఇటీవలే ప్రియుడు గౌత‌మ్ కిచ్లును పెళ్లాడి వివాహబంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ వెళ్లి తిరిగి వచ్చింది కాజల్. నెల రోజుల పాటు ఎంజాయ్ చేసిన ఈ జంట త‌మ త‌మ కెరీర్‌ లో మ‌ళ్లీ బిజీ అవుతున్నారు. అయితే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న కాజల్ నెలన్నర రోజులకే ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా మారిపోయింది. స్వతహాగా ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌ అయిన తన భర్త గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్‌ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. 'కిచ్డ్' పేరిట ఓ హోమ్ డెకార్ బ్రాండ్‌ ని ప్రారంభించినట్లు కాజ‌ల్ కిచ్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

''గౌత‌మ్ నేను క‌లిసి మీ కోసం 'కిచ్డ్' అనే హోమ్ డెకార్ లేబుల్‌ ని తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్ద‌రి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టింది. ముందుగా ఫెస్టివ్ థీమ్‌ తో చేతితో త‌యారు చేయ‌బ‌డిన కుష‌న్‌ ల‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అంద‌రికి న‌చ్చేవిధంగా మీ ఇంటి అందాన్ని పెంచేలా మీరు సంతృప్తి చెందేలా ప్రోడక్ట్ ల‌ను ఇవ్వ‌డ‌మే మా బ్రాండ్ ఉద్దేశ్యం. మాకు మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌స్తుతం లిమిటెడ్ క‌లెక్ష‌న్ మాత్ర‌మే ఉన్నందున నిరూత్సాహ పడకుండా ఉండేందుకు మీరు  ఇప్పుడే షాపింగ్ మొద‌లుపెట్టండి. మా బ్రాండ్ నుంచి వ‌స్తోన్న మొద‌టి ప్రోడక్ట్ మీకు నచ్చుతుందని న‌మ్ముతున్నాము'' అని కాజ‌ల్ పోస్ట్ చేసింది. ఏదేమైనా కాజల్ పెళ్ళైన వెంటనే భర్త అడుగు జాడల్లో నడుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి త‌రువాత కూడా సినిమాల్లో న‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు తాను కమిట్ అయిన సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది. ఇటీవలే హైదరాబాద్ లో తన భర్తతో కలిసి ల్యాండ్ అయిన కాజల్ కిచ్లు.. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 'ఆచార్య‌' షూటింగ్ లో పాల్గొంటోంది.
Tags:    

Similar News