ఆస్తుల విషయంలో కాజల్‌ అరుదైన ఘనత

Update: 2021-06-26 14:30 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ కెరీర్‌ ఆరంభించి 15 ఏళ్లు దాటింది. హిందీ సినిమా ల్లో మొదట నటించి 2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సినిమా లక్ష్మి కళ్యాణం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా కు గాను ఈమె దాదాపుగా పాతిక లక్షల పారితోషికం తీసుకుంది. అంతకు ముందు వరకు హిందీలో చేసిన సినిమా లకు రోజు వారి పారితోషికం అందుకున్న కాజల్‌ హీరోయిన్‌ గా లక్ష్మి కళ్యాణంకు మంచి పారితోషికం దక్కించుకుంది. ఆ సినిమా నిరాశ పర్చినా ఆ తర్వాత వరుసగా కాజల్‌ కు ఆఫర్లు వచ్చాయి.

టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో కాజల్‌ ముందు వరుసలో ఉంటుందనే విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున పారితోషికం అందుకుంటున్న కాజల్ అగర్వాల్‌ ఆస్తుల విషయంలో కూడా అరుదైన ఘనత దక్కించుకుంది. సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్ లో అత్యధిక ఆస్తులను కాజల్‌ కలిగి ఉంది. ఆస్తుల విషయంలో కాజల్‌ పలువురు స్టార్‌ హీరోయిన్స్ కంటే ముందు ఉంది. కాజల్‌ అగర్వాల్‌ ఆస్తుల విషయానికి వస్తే ఆమె కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్ల వరకు ఉన్నాయని సమాచారం.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ మాత్రమే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాజల్‌ ముందు నుండి పక్కా ప్లానింగ్‌ తో తనకు వచ్చిన పారితోషికంను సరైన రీతిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈ స్థాయిలో ఆస్తులను కాజల్ కూడబెట్టింది. యంగ్ హీరోయిన్స్ కు కాజల్ ఆదర్శంగా నిలిచింది. హీరోయిన్ గా కెరీర్‌ లో ఎంత కాలం కొనసాగేది క్లారిటీ ఉండదు. కనుక హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కాజల్ ను చూసి నేర్చుకోవాలి. సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్ లో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్స్ లో కాజల్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇదంతా కూడా ఆమె వ్యాపార నైపుణ్యంగా చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News