అమ్మడు కాజల్ డిమాండ్ మాత్రం తగ్గట్లేదుగా...!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి మంచి టైమ్ నడుస్తోంది. అందుకే క్రేజీ ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరోవైపు సినీయర్ హీరోలతో కూడా నటిస్తోంది. కాజల్ ప్రస్తుతం 'ముంబై సాగా అనే హిందీ సినిమాలో, 'హే సినామిక' అనే తమిళ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2' చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న 'ఆచార్య'లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా కాజల్ ఒక్కొక్కటిగా పెద్ద సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు. అయితే ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళినట్టు టాక్ వినబడుతోంది.
మురుగదాస్ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ త్వరలోనే 'తుపాకీ' సినిమాకి సీక్వెల్ గా 'తుపాకి 2' మొదలుపెట్టనున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 'తుపాకి' లో కూడా హీరోయిన్ కాజలే. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. కాజల్ ఇన్స్టా లైవ్ ద్వారా మాట్లాడుతూ విజయ్ తన ఫేవరెట్ కో స్టార్ అని హింట్ కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అఫీషియల్ న్యూస్ రావొచ్చని అనుకుంటున్నారు. ఇకపోతే కాజల్ - విజయ్ గతంలో 'మెర్సల్' 'జిల్లా' చిత్రాల్లో కలిసి నటించారు. ఇలా అన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని ఉంది మన చందమామ. వీటితోపాటు మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్ళు' అనే పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్న ఆ అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.