త‌ల్లైన చంద‌మామ మార్ష‌ల్ ఆర్స్ట్ ట్రైనింగ్ లో!

Update: 2022-09-26 07:32 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ త‌ల్లి  ప్రేమ‌ను  పంచుతోంది. వీలైనంత వ‌ర‌కూ ఇంట్లోనే స‌మ‌యాన్ని గ‌డుపుతోంది. భ‌ర్త  గౌత‌మ్ కిచ్లూ..పాపాయి మా త‌న ప్ర‌పంచంగా   జీవిస్తుంది. అలాగ‌ని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది? అనుకునేరు. ఓవైపు సినిమాల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తులు సైతం తిరిగి మ‌ళ్లీ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో మూడు..నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం  ఇండియ‌న్-2. ఇందులో  ర‌కుల్ తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఒక హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం కాజ‌ల్ మార్ష‌ల్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.  దీనిలో ఆమె కలరిపయట్టు అనే పురాతన యుద్ధ కళను అభ్యసిస్తున్నట్లు కనిపించింది. 3 సంవత్సరాలుగా అడపాదడపా ఈ కళను నేర్చుకుంటున్నట్లు కాజ‌ల్ రివీల్ చేసింది. ఇదంతా ఇండియ‌న్ -2 కోస‌మేన‌ని తెలుస్తోంది. ఇందులో కొన్ని భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయ‌ట‌.

అవి ఇలాంటి విద్య‌ని అభ్య‌సిస్తే  త‌ప్ప పూర్తిచేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించి శంక‌ర్ సూచించ‌డంతో ట్రైనింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు తె లుస్తోంది. వాస్త‌వానికి మూడేళ్ల‌గా ట్రైనింగ్  తీసుకుంటోందిట‌. మ‌ధ్య‌లో కోవిడ్ స‌హ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఏక ధాటిగా శిక్ష‌ణ పూర్తి కావ‌డం క‌ష్టం అవ్వ‌డంతో బ్యాలెన్స్ ట్రైనింగ్  కూడా ఇప్పుడు పూర్తిచేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌లే ఇండియ‌న్ -2 షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైన సంగ‌తి  తెలిసిందే. అతి త్వ‌ర‌లో నే కాజ‌ల్ కూడా  బ్యాలెన్స్ షూట్ ని పూర్తిచేసే అవ‌కాశం ఉంది. భార‌తీయుడు కోసం క‌మ‌ల్ హాస‌న్ మ‌ర్మ‌క‌ళ అనే విద్య‌ని నేర్చుకున్న సంగ‌తి  తెలిసిందే. ఆ విద్య తెలి స్తే ఎంత‌టి వారినైనా బొంద పెట్టొచ్చు.

చేతి రెండు వేళ్ల‌తో న‌రాలు  మెలి తిప్పితే ఎంత‌టి భారీ క‌టౌట్ అయినా కింద ప‌డుకోవాల్సిందే. మ‌రి ఇప్పుడు  కాజ‌ల్ నేర్చుకుంటోన్న విద్య  టెక్నిక్ ఏంటి? అన్న‌ది తెలియాలి.  అలాగే కాజ‌ల్  ఇంకా కొన్ని హిందీ..త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
4

Full View


Tags:    

Similar News