‘శాతకర్ణి’లో ఇంటర్నేషనల్ ఆర్టిస్టు

Update: 2016-05-03 11:30 GMT
ఏదో అనుకున్నారు కానీ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రేంజి రోజు రోజుకూ పెరిగిపోతోంది. రూ.70 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా తీస్తారంటే ముందు అది రూమరే అనుకున్నారు. కానీ ప్రారంభోత్సవం నాడే తెలిసింది ఇది చాలా పెద్ద స్థాయి సినిమా అని. కేవలం ఒక్క వార్ సీక్వెన్స్ కోసమే రూ.8 కోట్లు పెడుతున్నారంటే ఈ సినిమా రేంజేంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల విషయంలోనూ క్రిష్ ఏమాత్రం రాజీ పడట్లేదు. ఆల్రెడీ బాలయ్య తల్లిగా రాజమాత పాత్రకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ హేమమాలినిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం ఓ ఇంటర్నేషనల్ ఆర్టిస్టునే సెలక్ట్ చేశాడు క్రిష్.

హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలతోనూ పాపులర్ అయిన కబీర్ బేడి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కీలక పాత్ర చేయబోతున్నాడు. కబీర్.. ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ఫేమస్. హాలీవుడ్ సినిమాలతో పాటు టీవీ షోలతోనూ బాగా పాపులర్ అయ్యాడు. అలాంటి ఆర్టిస్టుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నటింపజేస్తే సినిమాకు మార్కెట్ పెరగడం ఖాయం. హేమమాలిని కూడా నటిస్తోంది కాబట్టి హిందీలోనూ పెద్ద స్థాయిలో రిలీజ్ చేసేందుకు అవకాశముంటుంది. మరోవైపు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ముందు నయనతారను అనుకున్నారు. తర్వాత కాజల్ పేరు వినిపించింది. కానీ ఆ ఇద్దరితోనూ వర్కవుట్ కాలేదు. తాజాగా ఇలియానా పేరు తెరమీదికి వచ్చింది. చివరికి బాలయ్య పక్కన ఎవరు కుదురుతారో చూడాలి.
Tags:    

Similar News