హెవీ మెటల్ 'కబాలీ' అదిరిపోయింది

Update: 2017-01-02 11:30 GMT
రీమిక్స్ చేయడం అనేదే చాలా సాధరణమైన విషయమే. అయితే ఈ మధ్యన కొందరు మ్యూజిక్ కళాకారులు మాత్రం.. ''కవర్'' పేరుతో తమకు నచ్చిన ఇనుస్ట్రమెంటుతో ఒక పాట మొత్తం ట్యూన్ ను వినిపిస్తున్నారు. ఇప్పుడు ''నిప్పురా తాకరా'' అనే పాటను అలాగే కొందరు ''కబాలి'' లవర్స్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు వారిచ్చిన ఈ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

డిస్టార్షన్ గిటార్.. హెవీ మెటల్.. బేస్ గిటార్.. మైండ్ బ్లోయింగ్ రిథమ్స్.. అదిరే పెర్క్యూషన్స్.. ఇలా హై వోల్టేజ్ సౌండ్ ను అదే ట్యూన్ స్టయిల్లో ప్రొడ్యూస్ చేసి చితక్కొట్టేశారంతే. చెన్నయ్ కు చెందిన ''జాను'' అనే బ్యాండ్ ఈ పాటను ఇలా రీమిక్స్ వర్షన్ టైపులో కంపోజ్ చేశారు. అఫీషియల్ గా ఈ పాటను యుట్యూబ్ లో రిలీజ్ చేయడంతో కబాలి ఫ్యాన్స్ అందరూ వెర్రెత్తిపోతున్నారంతే. ఒరిజినల్ పాటను సంతోష్ నారాయణ్‌ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.

సినిమా రిలీజై ఫ్లాపై వెళ్ళిపోయినప్పటికీ.. కబాలి మ్యానియా మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకెందుకు లేటు.. బేస్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ కొత్త ట్యూన్ వినడం స్టార్ట్ చేయడం మరి!!
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News