• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంతతో అప్పుడే ప్రేమలో...

సమంతతో అప్పుడే ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ

By - Tupaki Desk
Update: 2022-10-28 03:38 GMT
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైంది. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. తమిళంలో సూర్య.. కన్నడలో రక్షిత్ శెట్టి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్.. హిందీలో వరుణ్ ధావన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ సామ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ''కాలేజీలో చదువుకునే రోజుల్లో సమంత ను మొదటిసారిగా బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే నేను ఆమెతో ప్రేమలో పడిపోయా. ఈ రోజు ఆమె చేస్తున్న ప్రతిదానికీ నేను అభినందిస్తున్నాను.. ఆమెను ఆరాధిస్తాను'' అని VD అన్నారు.

సమంత రూత్ ప్రభు కొత్త చిత్రం 'యశోద' ట్రైలర్ ను మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 11-11-2022 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది అని వీడీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి సామ్ స్పందిస్తూ.. 'చాలా కృతజ్ఞతలు వి' అని ట్వీట్ చేసింది.

విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి గతంలో 'మహానటి' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు VD - సామ్ కలిసి ''ఖుషి'' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.

సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమాలో విజయ్ - సమంతల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు ఇన్సైడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది వరకే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే 'ఖుషి' సినిమాకు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తవ్వాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే నవంబర్ రెండో వారంలో తిరిగి సెట్స్ మీదుకు రానున్నారని.. తదుపరి షెడ్యూల్ లో సమంత - విజయ్ పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.

'ఖుషి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం - మలయాళం - కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు కానీ.. పరిస్థితులు చూస్తుంటే చెప్పిన డేట్ కి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Samantha 
  • VijayDevarkonda 
  • Yashoda 
  • Trailer 
  • Launch 
  • Tweet 
  • Kushi 
  • Love 
  • Tollywood 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS