• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తాప్సి సినిమా.. వంద...

తాప్సి సినిమా.. వంద కోట్లు.. 5 మిలియన్లు

By - Tupaki Desk
Update: 2017-10-10 09:12 GMT
గ్లామర్ క్యారెక్టర్లంటే అసలు తనకు ఇష్టమే లేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చిన తాప్సి.. ఇప్పుడు ఆ మాటలన్నీ కట్టిపెట్టేసి బికినీ అందాలు.. లిప్ లాక్స్‌ తో రెచ్చిపోతూ ‘జుడ్వా-2’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు సౌత్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ గురించి తాప్సి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ తాప్సిని సోషల్ మీడియాలో జనాలు బాగానే ఆడుకున్నారులే ఈ సినిమా రిలీజ్ టైంలో. ఆ సంగతలా వదిలేస్తే ‘జుడ్వా-2’ ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. స్లంప్ లో సాగుతున్న బాలీవుడ్ కు ఈ సినిమా అత్యావశ్యకమైన విజయాన్నందించింది.

సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్ల సినిమాలు దారుణమైన ఫలితాన్నందుకోగా.. మరీ పెద్ద స్టార్ కాస్ట్ ఏమీ లేకున్నా ‘జుడ్వా-2’ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం విశేషం. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్న ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. వరుణ్ ధావన్ కెరీర్లోనే ఇవే అత్యధిక వసూళ్లు. అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘బద్రీనాథ్ కి దుల్హానియా’ను ‘జుడ్వా-2’ దాటేసింది. ఈ చిత్రం అమెరికాలో ఏకంగా 5 మిలియన్ డాలర్ల కబ్బులో చేరడం విశేషం. వరుణ్ స్థాయికి అది చాలా పెద్ద ఘనతే. 90ల్లో ‘హలో బ్రదర్’కు రీమేక్ గా వచ్చిన ‘జుడ్వా’కు ఇది సీక్వెల్ కావడం విశేషం. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ రూపొందించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయికగా నటించింది.
Tags:    
  • Taapsee 
  • Varun Dhawan 
  • Judwaa 2 Movie 
  • Telugu NEWs 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS