తార‌క్ ‌కి దేవుడిచ్చిన త‌మ్ముడు ఎవ‌రంటే?‌

Update: 2020-09-23 07:50 GMT
స్టార్ హీరోల మ‌ధ్య బాండింగ్ అన్న‌ది చాలా అరుదు. 80లు అటుపై 90వ ద‌శ‌కంలో ఈ బాండింగ్ ఎక్కువ‌గా క‌నిపించేది. ఆ స్నేహంతోనే `గుండ‌మ్మ క‌థ‌`.. `మిస్స‌మ్మ` లాంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలొచ్చాయి. ఆ త‌రువాత కాలం మారింది. కాల‌క్ర‌మంలో హీరోల‌కు అభిమానగణం పెరిగింది. సినిమాల్లో మార్పు వ‌చ్చింది. దీంతో ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టించే చిత్రాల్ని భూత‌ద్దంలో వెతకాల్సి వ‌చ్చింది. బ‌ట్ ట్రెండు మళ్లీ మారింది.

పాత రోజులు మ‌ళ్లీ వ‌చ్చాయా? అనేంత‌గా మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల శ‌కం మొద‌లైంది. ఇద్ద‌రు హీరోల అభిమాన సంఘాలు త‌న్నుకునే స్థాయి నుంచి క‌లిసి న‌డిచే స్థాయికి కాలం మారింది. స్టార్ హీరోల మ‌ధ్య అశ్చ‌ర్య‌పోయే బాండింగ్ మొద‌లైంది. అచ్చం ఇలాంటి బాండింగే స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగాప‌వ‌ర్ ‌స్టార్ రామ్ ‌చ‌ర‌ణ్ ‌ల మ‌ధ్య కుదిరింది. ఈ ఇద్ద‌రు క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ వెల్ల‌డించిన విష‌యాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

మెగా హీరో రామ్ ‌చ‌ర‌ణ్ త‌న‌కు దేవుడిచ్చిన తమ్ముడ‌ని చెప్పేశాడ‌ట‌. దీంతో మెగా నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య వున్న గ్యాప్ ని క‌ట్ చేసేసింది. గ‌త కొంత కాలంగా ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య వున్న ఆధిప‌త్యం ధోర‌ణి రాజ్య‌మేలుతుండేది.. కానీ ఈ స్టేట్ ‌మెంట్ తో ఒక్క‌సారిగా అభిమానుల మ‌ధ్య వున్న అనుమాన‌పు తెర చెరిగిపోయింది.
Tags:    

Similar News