ఎన్టీఆర్ చెప్పాక...కొరటాల కాదంటాడా?

Update: 2021-04-19 05:30 GMT
2016లో వచ్చిన 'జనతా గ్యారేజ్‌' పెద్ద హిట్ అవటంతో ఆ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ వచ్చేసింది. అయితే సరిగ్గా ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పని చేయటానికి సిద్దపడుతున్నారు. ఈ విషయాన్ని కొరటాల శివ సోమవారం అధికారికంగా ప్రకటించాడు.అలాగే ఇది తారక్‌కు 30వ సినిమా.  ఈ చిత్రం షూటింగ్‌ అయినా మొదలు పెట్టకముందే రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టెక్నీషియన్స్ ఎంపిక మొదలైంది. ఈ క్రమంలో కొరటాల పంపిన లిస్ట్ లో కొన్ని మార్పులు చేసారట ఎన్టీఆర్. ముఖ్యంగా మ్యూజిక్ డైరక్టర్ విషయంలో అని తెలుస్తోంది.

కొరటాల ప్రస్తుతం ఆచార్య చిత్రం కోసం మణిశర్మతో కలిసి పనిచేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట బయిటకు వచ్చి చార్ట్ బస్టర్ గా నిలిచింది. దాంతో కొరటాలకు మణిశర్మని ఎన్టీఆర్ సినిమాకు రిపీట్ చేద్దామనుకున్నారట. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవిశ్రీప్రసాద్ వైపే మ్రొగ్గు చూపుతున్నారట. తమ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన  'జనతా గ్యారేజ్‌' కు దేవినే సంగీతం అందించారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ లో చేస్తే మ్యూజికల్ గా పెద్ద హిట్ అవుతుంది. సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుంది అని ఎన్టీఆర్ ఆలోచన. కొరటాల కూడా ఈ సూచనను అంగీకరించే అవకాసం ఉంది కానీ మణిశర్మతో మళ్లీ సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అయితే ఆ తర్వాత సినిమాకు చేద్దాము అని మణిశర్మకు చెప్పి దేవితో వెళ్తాడనే అంటున్నారు. ఎందుకంటే హీరో ప్రత్యేకించి చెప్పాక, డైరక్టర్ కాదనేదేముంటుంది అంటున్నారు సినీ జనం.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న  సినిమాను థియేటర్లలో వదులుతామని వెల్లడించారు కొరటాల. 'ఇంతకుముందు లోకల్‌ రిపేరింగ్స్‌ మాత్రమే చేశాం.. కానీ ఈసారి దాని సరిహద్దులు చెరిపేస్తాం..' అని చెప్పుకొచ్చాడు శివ. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. మరోసారి కొరటాలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఈ సినిమాను తారక్‌ సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, 'ఆచార్య' తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారు.
Tags:    

Similar News