ఓటీటీ వరల్డ్ లో మార్పులకు జియో కారణం కాబోతోందా...?

Update: 2020-07-15 18:10 GMT
టెలికాం రంగంలో సంచలన సృష్టించిన జియో.. బ్రాండ్ బాండ్ సేవల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు లేటెస్టుగా మరో సంచలనానికి తెరలేపింది జియో - రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకురానున్నాయి. ఇప్పటికే జియో ద్వారా అనేక సేవలు అందిస్తున్న రిలయన్స్ ఈ క్రమంలో Jio TV+ (జియో టీవీ ప్లస్) ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్ అయిన నెట్‌ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ - ఊట్ - జీ 5 - జియో సినిమా - జియో సావన్ - యూట్యూబ్ లాంటి 12 స్ట్రీమింగ్ యాప్స్‌ ని ఒకే చోట జియో టీవీ+ అందించబోతోంది. దీనికి సంభందించిన వివరాలను 43వ రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా వీక్షకులకు ప్రధాన ఛానెల్స్ తో పాటు ఈ ఓటీటీలు కూడా ఒకే చోట లభించే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే వెబ్ వరల్డ్ లో కూడా సమూల మార్పులకు రిలయన్స్ కారణం కాబోతోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ జియో టీవీ+ లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ యాప్ ఓపెన్ చేయకుండా కేవలం వాయిస్ సెర్చ్ తో వేర్వేరు ప్లాట్‌ ఫార్మ్స్ లోని కంటెంట్ సెర్చ్ చేయొచ్చని.. వేర్వేరు లాగిన్ ఐడీలు కూడా అవసరం లేదని తెలుస్తోంది. జియో సెట్ టాప్ బాక్స్ మరియు జియో ఫైబర్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ ను దృష్టిలో పెట్టుకొని జియో టీవీ+ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలు పొందడానికి ధరలు ఎంత నిర్ణయించబోతున్నారో అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News