జెర్సీ దర్శకుడు పాన్ ఇండియా రేంజుకు..!
జెర్సీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డెబ్యూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఇదే సినిమాని బాలీవుడ్ లో షాహిద్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు నిర్మాతల ప్రోత్సాహంతోనే అతడు బాలీవుడ్ కి వెళుతున్నాడు. అక్కడా హిట్ కొడతాననే ధీమాతో ఈ యువదర్శకుడు ఎంతో కేర్ ఫుల్ గా ప్రాజెక్టును డిజైన్ చేసి ముందుకెళ్లాడు.
అంతేకాదు.. గౌతమ్ తిన్ననూరి తదుపరి లైన్ చూస్తుంటే అతడి స్థాయి అమాంతం ఒక్కసారిగా స్కైని టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి జెర్సీ రిలీజైనప్పుడు బాక్సాఫీస్ ఫలితం విషయంపై కొన్ని విమర్శలు చెలరేగినా అందుకు భిన్నంగా అతడిలోని సునిశిత శైలిని మెచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అప్పట్లోనే గౌతమ్ తిన్ననూరి వినిపించిన లైన్ కి ఓకే చెప్పారు.
ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ ని పూర్తి చేస్తూనే దీనిపై గౌతమ్ వర్క్ చేస్తున్నారు. ఇది కచ్ఛితంగా పాన్ ఇండియా రేంజ్ కాన్సెప్టు అన్న గుసగుసా తాజాగా వినిపిస్తోంది. నిజానికి నవతరం దర్శకుల ఆలోచనలే వేరే లెవల్లో ఉంటున్నాయి. అవకాశం ఇస్తే యూనివర్శల్ కాన్సెప్టులతో మిరాకిల్స్ చేసే సత్తా ఉందని నిరూపించేందుకు సర్వసన్నాహకాల్లో ఉంటున్నారు. టెక్నికల్ గానూ అద్భుత విజ్ఞానంతో ఈ రంగంలోకి వస్తున్న నేటి తరం ఎలాంటి సినిమాలు చేసేందుకైనా సంసిద్ధంగనే ఉండడం ఆశ్చర్యం కలిగించేదే. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న జెర్సీ సినిమాతో బాలీవుడ్ వర్గాల్లోనూ అతడు హాట్ టాపిక్ గా మారుతున్నాడు.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా తరహాలోనే గౌతమ్ కూడా మిరాకిల్ చేస్తే కచ్ఛితంగా అతడు అతి పెద్ద హిందీ మార్కెట్ తో పాన్ ఇండియా రేంజు దర్శకుల జాబితాలో చేరతాడు. అటుపై చరణ్ అతడితో చేయబోయేది పాన్ ఇండియా రేంజు మూవీనే అవుతుందన్న అంచనా ఏర్పడింది. ఇటు చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో హిందీ మార్కెట్ ని పెద్ద రేంజులో టచ్ చేయబోతున్నాడు కాబట్టి అది అన్ని విధాలా కలిసొస్తుంది. క్యాలిక్యులేషన్స్ అన్నీ వర్కవుటై మిరాకిల్స్ జరిగితే కచ్ఛితంగా మన తెలుగు యువ దర్శకులు మరో లెవల్ ని టచ్ చేస్తారనడంలో సందేహమేం లేదు.