• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ళ‌ప‌తి రికార్డునే...

ద‌ళ‌ప‌తి రికార్డునే కొట్టేసిన జాతిర‌త్నాలు!

By - Tupaki Desk
Update: 2021-03-14 07:30 GMT
అంతా సానుకూలంగా ఉంటే అమెరికా మార్కెట్ టాలీవుడ్ కి మ‌రో నైజాంలా క‌లిసొస్తుంద‌ని నిరూప‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హమ్మారీ అమెరికాను వీడ‌క ఇబ్బంది పెడుతున్నా మొన్న రిలీజైన  జాతిర‌త్నాలు బంప‌ర్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.

ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో రిలీజైన `మాస్ట‌ర్` రికార్డుల్ని బ్రేక్ చేయ‌డం చూస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. అంతా న‌వ‌త‌రం క‌మెడియ‌న్ల‌తో రూపొందించిన  ఈ సినిమాని ఎన్నారైలు గొప్ప‌గా ఆద‌రించ‌డంతోనే ఈ క‌లెక్ష‌న్లు సాధ్య‌మ‌య్యాయ‌ని తెలిసింది. జాతి రత్నాలు కేవ‌లం 4 రోజుల్లో సూపర్ స్టార్ విజ‌య్ సినిమాను కొట్టేయ‌డం చూస్తుంటే అమెరికాలో ఏ స్థాయి విజ‌యం సాధించిందో అర్థం చేసుకోవ‌చ్చు.

వాణిజ్య వర్గాల సమాచారం ప్రకారం ఈ వారాంతంలో జాతిర‌త్నాలు 750 K వసూలు చేస్తుంది. కోవిడ్ విల‌యంలోనూ ఇంత పెద్ద వ‌సూళ్ల‌తో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఫుల్ ర‌న్ లో కేవ‌లం అమెరికా నుంచి 6-7 కోట్లు (1 మిలియ‌న్) వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

నిజానికి క్రైసిస్ లేక‌పోతే అమెరికా నుంచి ఈ చిత్రం 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసేద‌ని అంచ‌నా వేస్తున్నారు. గీతా గోవిందం- పెళ్లి చూపులు-అర్జున్ రెడ్డి త‌ర‌హాలోనే కంటెంట్ ఉన్న సినిమా ఇది అని ప్రూవైంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన `జాతి రత్నలు` మార్చి 11 న థియేటర్లలో రిలీజైంది. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని తెలుగు రాష్ట్రాలు స‌హా విదేశాల్లోనూ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది.
Tags:    
  • Jathi Ratnalu 
  • Jathi Ratnalu movie 
  • Jathi Ratnalu review 
  • Jathi Ratnalu Movie talk 
  • Naveen Polishetty 
  • Naveen Polishetty movie review 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS