• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యూజెర్సీలో హల్ చల్...

న్యూజెర్సీలో హల్ చల్ చేస్తున్న జోగిపేట బాయ్స్..!

By - Tupaki Desk
Update: 2021-03-20 05:48 GMT
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ''జాతి రత్నాలు''. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఫరీదా హీరోయిన్ గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. స్వప్న సినిమాస్‌ పతాకంపై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్ లో గ్రాండ్‌ గా సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు యూఎస్ లో విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 'జాతిరత్నాలు' సినిమా యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కరోనా పాండమిక్ తర్వాత అక్కడ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో తమ ఆనందాన్ని యూఎస్ ఆడియన్స్ తో పంచుకోవడానికి మన జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి - ప్రియదర్శి అక్కడ వాలిపోయారు. జోగిపేట బాయ్స్ న్యూజెర్సీలో హంగామా చేయబోతున్నారని మేకర్స్ ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి రథన్‌ సంగీతం సమకూర్చారు. బ్రహ్మానందం - మురళీ శర్మ - వెన్నెల కిశోర్‌ - బ్రహ్మజీ - తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Meet Jogipet boys soon in New Jersey.#JathiRatnalu @FlyHighCinemas @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic pic.twitter.com/6K6ZfILneP

— Swapna Cinema (@SwapnaCinema) March 19, 2021
Tags:    
  • Naveen Polishetty 
  • Jaathi Ratnalu 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS