జపనీస్ మన 'డార్లింగ్'ని ఎందుకంత ఇష్టపడతారు...?

Update: 2020-04-23 23:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశం మొత్తాన్ని ఒక్క సినిమాతో తనవైపు తిప్పుకున్న 'డార్లింగ్' ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రభాస్ కి దేశ విదేశాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని దేశాల మాదిరిగానే 'బాహుబలి' సినిమా త‌ర్వాత ప్రభాస్‌ ని జ‌పాన్ వాసులు ఆరాధిస్తున్నారు. తాజాగా ప్ర‌భాస్ డై హార్డ్ ఫ్యాన్ రినా మాట్సుయ్.. ప్ర‌భాస్‌ ని జపాన్ లో ఎందుకు అంత‌గా అభిమానిస్తున్నారో వివ‌రించింది.

జ‌పాన్ నుండి వ‌చ్చిన ప్రభాస్ వీరాభిమాని రినా మాట్సుయ్ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ''మేము ప్ర‌భాస్‌ ని  ప్రేమగా ‘ప్రభాస్ సాన్’ అని పిలుస్తాం.. అత‌ని అందంతో పాటు గంభీర‌మైన స్వ‌రం మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అతని యాక్షన్ మరియు రొమాన్స్‌ ని వ్య‌క్తిగ‌తంగా ఇష్ట‌పడ‌తాను. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత ప్ర‌భాస్ ఇంటికి వెళ్లి.. జ‌పాన్ వాసులు ఆయ‌న‌ని ఎంత‌గా ప్రేమిస్తున్నారో చెప్పాల‌ని ఉంది'' అని రినా వెల్లడించింది. 'బాహుబలి' సినిమాని వివిధ దేశాల్లో వారి భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

రీసెంటుగా విడుదలైన సాహో కూడా ప్రభాస్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ప్రతి సినిమాని పాన్ ఇండియా మూవీస్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ - పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాతో మన డార్లింగ్ ఇంకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటాడో చూడాలి.


Tags:    

Similar News