• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరుదైన బయోపిక్ లో దఢక్...

అరుదైన బయోపిక్ లో దఢక్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2018-12-05 08:20 GMT
అతిలోకసుందరి దివంగత శ్రీదేవి వారసురాలి గా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తోంది. వెల్లువలా వస్తున్న ఆఫర్స్ ని ఎడాపెడా ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటోంది. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ మల్టీ స్టారర్ తప్ప ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయని జాన్వీ ఓ బయోపిక్ కి ఓకే చెప్పిందని సమాచారం. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా కథ ఆధారంగా రూపొందబోయే మూవీలో ఆ పాత్ర జాన్వీ కే దక్కిందట.

ఇంత చిన్న వయసులోనే అంత ఛాలెంజింగ్ రోల్ దక్కించుకోవడం పట్ల జాన్వీ బాగా ఎగ్జైట్ అవుతోందట. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ చేసిన సాహసాలు అప్పట్లో సంచలనమయ్యాయి. పత్రికల్లో చదివినప్పుడే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న తన వీర గాధ తెరమీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. జాన్వీ ఈ పాత్ర కోసమే గుంజన్ సక్సేనాను కలిసి ఆవిడ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుని మరీ వచ్చిందట. శౌర్య వీరచక్ర అవార్డు గ్రహీత అయిన ఆవిడ రోల్ పోషించడం అంటే ఆషామాషీ కాదు కాబట్టి జాన్వీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట.

దర్శకుడు టీమ్ తదితర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంత రిస్కీ ప్రాజెక్ట్ ను మూడో సినిమాకే ఒప్పుకున్న జాన్వీని చూసి అభిమానులు తల్లి కి తగ్గ కూతురే అనుకుంటున్నారు. శ్రీదేవి తన కెరీర్ లో ఇలా ప్రత్యేకంగా ఒకరి బయోపిక్ లో ఎన్నడూ నటించలేదు. అలాంటిది జాన్వీ చేస్తోంది అంటే కపూర్ ఫ్యామిలీ కి సైతం ఇంత కంటే గుడ్ న్యూస్ ఏం కావాలి.
Tags:    
  • Janvi Kapoor 
  • Gunjan Saxena biopic 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS