• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మలయాళ సినిమాపై మనసు...

మలయాళ సినిమాపై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ...?

By - Tupaki Desk
Update: 2020-07-18 01:30 GMT
సినీ ఇండస్ట్రీని కొన్నేళ్లపాటు ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. మరాఠీ సినిమా 'సైరాత్' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. అయినప్పటికీ అమ్మడు తన అభినయంతో గ్లామర్ తో మంచి గుర్తింపునే దక్కించుకుంది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత 'ఘోస్ట్ స్టోరీస్' అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. లేటెస్టుగా 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది జాన్వీ. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ బయోపిక్ గతేడాది డిసెంబర్ లోనే పూర్తయింది. అయితే ఇండస్ట్రీలో నెలకొనియున్న పరిస్థితుల వలన రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ ఓ మలయాళ సినిమాపై మనసు పారేసుకుందట. మలయాళంలో గతేడాది రిలీజై సూపర్ హిట్ అయిన 'హెలెన్' చిత్రాన్ని ఇటీవల చూసిన జాన్వీ ఈ సినిమా రీమేక్ లో నటించాలని ఆశపడుతోందట. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా స్వతంత్ర భావాలు కలిగిన ఓ యువతి అనుకోకుండా ఓ కోల్డ్ స్టోరేజ్‌ లో చిక్కుకుని ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది.. అక్కడ నుండి ఎలా బయటపడింది అనే నేపథ్యంలో ఉంటుంది. అన్నా బెన్ - లాల్ - నోబుల్ బాబు థామస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించగా వినీత్ శ్రీనివాసన్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాని తమిళ్ మరియు కన్నడ భాషలలో రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా రీమేక్ చేయాలని పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'హెలెన్'ని హిందీలో రీమేక్ చేస్తే జాన్వీ కపూర్ లీడ్ రోల్ పోషించనుందట. ఇదే కనుక నిజమైతే జాన్వీకి మరో ఛాలెంజింగ్ రోల్ దొరికినట్లే అని చెప్పవచ్చు.
Tags:    
  • Janhvi Kapoor 
  • Malayalam Movie 
  • Helen 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS