ఇన్ స్టాలో అన్ ఫాలో.. యువ జంట మ‌ధ్య గొడ‌వ‌లు?

Update: 2021-01-30 04:46 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి వార‌సురాలు జాన్వీ కపూర్ కెరీర్ ప‌రంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ క్ర‌మంలోనే యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని.. ఆ ఇద్ద‌రూ డీప్ ల‌వ్ లో ఉన్నార‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం ఈ జంట దోస్తానా 2 చిత్రీక‌ర‌ణ కోసం సిద్ధంగా ఉన్నారు. లాక్ డౌన్ తొల‌గించిన త‌ర్వాత ఈ మూవీ ని తిరిగి ప్రారంభించినా తాజా షెడ్యూల్ విష‌యంలో కొంత ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొంద‌ని తెలిసింది.

దోస్తానా 2 చిత్రాన్ని 2019 లో ప్రకటించారు. అయితే మెజారిటీ షూట్ యునైటెడ్ కింగ్ ‌డమ్ ‌లో చిత్రీకరించాల్సి ఉండ‌గా.. మార్చి 2020 నుండి క‌రోనా మహమ్మారి వ‌ల్ల షెడ్యూల్ ‌ను నిలిపివేసారు. తాజా స‌మాచారం ప్రకారం.. దోస్తానా 2 UK లో చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి యూనిట్ సిద్ధంగా ఉంది. కానీ యూకే మరొకసారి స్ట్రెయిన్ వ‌ల్ల‌ లాక్ డౌన్ లోకి వెళ్లింది. ఇప్పుడు ఫిబ్రవరి చివరి వరకు కూడా లాక్ డౌన్ ని విధించారు. ఈ స‌న్నివేశంలో ఈ ఏడాది లో విడుదల చేయాలంటే.. రీషెడ్యూల్ చేయ‌డ‌మో లేదా లొకేష‌న్ ని మార్చ‌డ‌మో చేయాల్సి ఉంటుంది.

అయితే దోస్తానా 2 షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్న క్ర‌మంలోనే ఇన్ ‌స్టాగ్రామ్ లో జాన్వి కపూర్ -కార్తీక్ ఆర్యన్ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవ‌డం అభిమాన సంఘాల్లో చ‌ర్చకు వ‌చ్చింది. ఇంత‌కీ ఈ జోడీ మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోంది? అన్ ఫాలో అయ్యారంటే ల‌వ్ లేన‌ట్టేనా?  విడిపోయారా? అంటూ కొంద‌రు అభిమానులు సందేహం వ్య‌క్తం చేశారు.

గత కొన్ని రోజులుగా ఆ ఇద్ద‌రి మధ్యా ఉద్రిక్తత వాతావర‌ణం నెలకొంది. దానికి కార‌ణం ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు అభిమానులు వ్యాఖ్యానించారు. ఇంత‌కుముందు గోవా ట్రిప్ త‌ర్వాత ఇలా అయ్యింది.  కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు దోస్తానా 2 సహనటుల మధ్య వివాదం నెలకొంది. ఇన్ స్టాగ్రామ్ ‌లో కార్తీక్ .. జాన్వి ఒకరినొకరు అనుసరించడం లేదు. కార్తీక్ - జాన్వి అభిమానుల క్లబ్ లు ఈ విష‌యాన్ని వైర‌ల్ చేస్తున్నాయి. అస‌లేం జ‌రిగిందో అని ఫ్యాన్ క్ల‌బ్ లు ఆరాలు తీస్తున్నాయి.

ఇంత‌కీ జాన్వీ- కార్తీక్ ల‌వ్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?  అన్ ఫాలో వెన‌క మీనింగ్ ఏమిటి? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు దీనిపై అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News