• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘జనతా గ్యారేజ్’...

‘జనతా గ్యారేజ్’ వెనక్కి..‘జై లవకుశ’ ముందుకు..

By - Tupaki Desk
Update: 2017-09-22 07:43 GMT
యుఎస్ తెలుగు ఆడియన్స్ క్లాస్ ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమాలకే అక్కడే వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్ సినిమాల్లో క్లాస్ టచ్ ఉన్న ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’ సినిమాలు అక్కడ భారీ వసూల్లు సాధించాయి. ఒకటి 2 మిలియన్ మార్కు దాటితే.. ఇంకోటి 1.8 మిలియన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి వచ్చిన ‘జై లవకుశ’ మాస్ మసాలా సినిమా కావడంతో అమెరికాలో దీనికి ఏమాత్రం వసూళ్లు ఉంటాయో అని సందేహించారు. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఈ చిత్రం యుఎస్‌ లో అదరగొట్టేసింది. ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్కు దాటేసింది. ‘జనతా గ్యారేజ్’ అక్కడ 5.87 లక్షల డాలర్లతో ఎన్టీఆర్ సినిమాల్లో ప్రిమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టిస్తే.. దాన్ని ‘జై లవకుశ’ దాటేసింది. ఈ చిత్రం అక్కడ బుధవారం 5.89 లక్షల డాలర్లు వసూలు చేసింది.

గురువారం వసూళ్లు కూడా కలుపుకుంటే ‘జై లవకుశ’ వసూళ్లు 9 లక్షల డాలర్ల దాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే రెండో రోజుకే ఈ చిత్రం మిలియన్ క్లబ్బులోకి చేరబోతోందన్నమాట. సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో శని.. ఆదివారాల్లోనూ వసూళ్లు భారీగా ఉంటాయి కాబట్టి ‘జనతా గ్యారేజ్’ ఫుల్ రన్ వసూళ్లను తొలి వారాంతంలోనే ‘జై లవకుశ’ దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఫుల్ రన్లో ‘నాన్నకు ప్రేమతో’ వసూళ్లను కూడా దాటడం ఖాయమే. ఈ చిత్ర యుఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని రూ.8.5 కోట్లకు అమ్మారు. 1.6 మిలియన్ డాలర్ల మార్కును దాటితే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి వస్తాడు. దీన్ని బట్టి చూస్తే బయ్యర్ లాభాల బాట పట్టడం ఖాయమనే చెప్పాలి.
Tags:    
  • Jai Lava Kusa 
  • JLK Premier Collections 
  • Telugu NEWs 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS