మెగా రీమేక్ కోసం జగ్గూబాయ్
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ చిత్రంను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ రీమేక్ త్వరలో పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి డైలాగ్ వర్షన్ రెడీ చేస్తున్నారట. సాయి మాధవ్ బుర్ర ఈ రీమేక్ కోసం పవర్ పుల్ డైలాగ్స్ ను రాస్తున్నారట. ఇదే సమయంలో సినిమాలకు సంబంధించిన నటీనటుల ఎంపిక పక్రియ కూడా జరుగుతున్నట్లుగా మెగా వర్గాల ద్వారా టాక్ వినిపిస్తుంది.
ూసీఫర్ రీమేక్ లో కీలక పాత్రను ఖుష్బు పోషించబోతున్నట్లు గా ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజా గా ఈ సినిమా లోని కీలక పాత్ర ను జగపతి బాబు తో చేయించేందుకు సుజీత్ చర్చలు జరుపుతున్నాడట. ఈమద్య కాలం లో స్టార్ హీరోల చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రల్లో కనిస్తున్నాడు. అది సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అవుతుంది. అందుకే ఆయన్ను ఈ చిత్రం లో నటింపజేయడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లూసీఫర్ చిత్రంను వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి ఆచార్య చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మద్యలో ఆగిపోయింది. పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో షూటింగ్ పున: ప్రారంభించే అవకాశం ఉంది. ఆచార్య ఇంకా లూసీఫర్ రీమేక్ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి.. జగపతి బాబుల కాంబో సైరాలో చూశాం. మళ్లీ లూసీఫర్ రీమేక్ లో ఎలా ఉంటుందో చూడాలి.