పూరీ అయితే.. స్టోరీ కూడా అడగడట
పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇజం మరో మూడు రోజుల్లో రిలీజ్ అయిపోతోంది. ఈ మూవీలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించగా.. ఓ ప్రధానమైన పాత్రలో సీనియర్ నటుడు జగపతిబాబు కనిపిస్తున్నాడు. లుక్స్ నుంచి కేరక్టర్ వరకూ జేబీ నటించిన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ లో అర్ధమైపోయింది. ఇజంలో జావేద్ భాయ్ గా కనిపించనున్నాడు జగపతి.
అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ఇజం మూవీకి ఇప్పుడు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వీటిలో భాగంగా పూరీపై తన ఎమోషన్స్ ను చెబుతున్నాడు జగపతి బాబు. మామూలుగానే ఎటువంటి మొహమాటాలు లేకుండా మాట్లాడే జేబీ.. పూరీ విషయంలో మరింతగా ఓపెన్ అయిపోయాడు. "నాకు జగన్ అంటే చాలా ఇష్టం. అతన్ని ఓ టెక్నీషియన్ గానే కాదు.. ఓ వ్యక్తిగా కూడా బోలెడంత అభిమానిస్తా. తన సినిమాలో నటించమని నాకు ఆఫర్ ఇస్తే.. నేను తనను స్టోరీ కూడా అడగను. అంతగా పూరీ జగన్నాథ్ ను నమ్ముతాను" అంటున్నాడు జగపతి బాబు.
అసలు పూరీ కెరీర్ స్టార్టింగ్ లో మొదట బద్రి తర్వాత.. బాచి అంటూ జగపతిబాబుతోనే సినిమా చేశాడు. పెద్దగా ఆడలేదు కానీ.. అందరికీ బోలెడంత గుర్తింపు వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నా.. పర్సనల్ గా మాత్రం పూరీ-జగపతి మధ్య బోలెడంత ఫ్రెండ్ షిప్ ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/