• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కథ వినకుండానే సై...

కథ వినకుండానే సై అన్నారు.. అదీ రేంజ్

By - Tupaki Desk
Update: 2018-04-12 17:30 GMT
ప్రతిభ ఉన్న వాళ్లతో పనిచేసేందుకు నటీనటులు ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎంత కమర్షియల్ ఇండస్ట్రీ అయినా జాబ్ శాటిస్ఫాక్షన్ దక్కుతుందని.. ఓ మంచి సినిమాను చేశామని.. ఓ గొప్ప పాత్రలో నటించామనే సంతృప్తి మిగిలితే చాలు.. మిగతా ఏమీ ఆలోచించకుండా.. ఆశించకుండా.. కనీసం కథ కూడా వినకుండా సినిమాను ఒప్పుకోవడం అంటే.. చాలా గొప్ప విషయమే. ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న దర్శకుల జాబితాలో సుకుమార్ ను ప్రముఖంగా చెప్పుకోవాలి.

ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న సుకుమార్.. తన సినిమాలో క్యారెక్టర్లను ఖాయం చేసుకుంటూ.. ప్రెసిడెంట్ పాత్ర కోసం జగపతిబాబును అనుకున్నాడట. ఎప్పటి నుంచో సుకుమార్ తో సినిమా చేయాలని చూస్తున్న జగ్గూ దాదా.. జస్ట్ సుక్కూ వచ్చి.. క్యారక్టర్ బావుంటుంది సార్ అన్నాడట. దానితో జగపతి బాబు.. నాయనా కథ చెప్పొద్దు.. డేట్లు చెప్పు చాలు.. వచ్చేస్తా అన్నాడట. 'అలా కాదండీ.. మీది ప్రెసిడెంటు పాత్ర.. కనీసం ఒంటి మీద చొక్కా కూడా ఉండదు.. తన కోసం తానే పాలు పితుక్కుంటూ ఉంటాడు' అని సుకుమార్ చెబుతుంటే.. అవేమీ వినిపించుకోకుండా.. 'ఎప్పుడు షూటింగ్ కు రావాలో చెబితే చాలు.. డేట్స్ నేను ఎడ్జస్ట్ చేసుకుంటాను.. ఇంకేమీ చెప్పద్దు' అని చెప్పి సుకుమార్ ను పంపించేశాడట జగపతి బాబు.

సుకుమార్ కోసం అందరూ ఏ రేంజులో ఎదురు చూస్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. అంతెందుకు.. రామ్ చరణ్ కు అత్త పాత్ర అంటే అనసూయ జడిసిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. 'అత్త ఏంటి.. మంచి రోల్ అయితే అమ్మమ్మ పాత్ర అయినా నటించేస్తా' అనడం లేదూ. ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో చేస్తే అలా ఉంటుంది మరి.
Tags:    
  • Jagapathi Babu 
  • Rangasthalam Movie 
  • Sukumar 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS