200 కోట్ల స్కామ్! భార్యతో కలిసే హీరోయిన్ లకు వల!!
200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ పై దాఖలు చేసిన చార్జిషీట్ లో షాకిచ్చే నిజాలెన్నో బయటపడుతున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ నుంచి రూ.200 కోట్లు ఎగవేసినందుకు సుకేష్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో ఈ కేసుకు సంబంధించి విచారించిన బాలీవుడ్ నాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
జాక్విలిన్ ఫెర్నాండెజ్ .. నోరా ఫతేహీలకు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇచ్చాడని అవి నేరం చేసిన సొమ్ములోంచి తీసినవేనని ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది. చంద్రశేఖర్ తన మేకప్ ఆర్టిస్ట్ ద్వారా ఫెర్నాండెజ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడని అయితే తొలిగా ఆమె తిరస్కరించినప్పుడు అతను స్పూఫ్ కాల్ చేసి .. ``ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని`` అని పోజు కొట్టాడని చార్జిషీట్ పేర్కొంది.
తాను జయలలిత రాజకీయ పార్టీకి చెందినవాడినని సన్ టీవీ యజమానినని సుకేష్ పేర్కొన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. అతను అరెస్ట్ అయ్యే వరకు ఫెర్నాండెజ్‌తో టచ్ లో ఉన్నాడు. ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు అనేక బహుమతులు అందించాడు. ఆమె భారతదేశంలో ప్రయాణించడానికి .. హోటల్ బస చేయడానికి చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేశాడు.
ఆమె తరపున స్క్రిప్ట్ రైటర్ కు నగదు రూపంలో చెల్లింపులు చేశాడు... ఈ ఖర్చులు/చెల్లింపులన్నీ సుకేష్ చంద్రశేఖర్ ఒక షెడ్యూల్డ్ నేరానికి సంబంధించిన క్రిమినల్ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయం నుంచి చేసినవి” అని ED పేర్కొంది.
విచారణ సందర్భంగా ఫెర్నాండెజ్ షాకిచ్చే కానుకల వివరాల్ని వెల్లడించింది. తనకు మూడు గూచీ .. చానెల్ డిజైనర్ బ్యాగ్ లు.. జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులు.. ఒక జత లూయిస్ విట్టన్ షూలు.. రెండు జతల డైమండ్ చెవిపోగులు .. బహుళ వర్ణ రాళ్ల బ్రాస్ లెట్ ను బహుమతులుగా అందుకున్నట్లు ED ముందు జాకీ అంగీకరించింది. రెండు హీర్మేస్ కంకణాలు. ..ఆమె ఒక మినీ కూపర్ ని కూడా అందుకుందిట.
2020 డిసెంబర్ లో సుకేష్ నోరా ఫతేహికి బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడని ఈడీ పేర్కొంది. సుకేష్ భార్య లీనా మారియా పాల్ తాను .. తన భర్త నోరా ఫతేహీకి అభిమానులమని ``వారు ప్రేమ .. ధాతృత్వానికి చిహ్నంగా ఆమెకు సరికొత్త BMW కారును బహుమతిగా ఇచ్చారు`` అని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
ED ఛార్జ్ షీట్ లోతుల్లోకి వెళితే.. “సుకేష్ చంద్రశేఖర్ USAలోని జాక్విలిన్ సోదరి Ms జెరాల్డిన్ ఫెర్నాండెజ్ కు USD 150000 మేరకు రుణం ఇచ్చారని Ms జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేర్కొంది. సుకేష్ ఆస్ట్రేలియాలోని తన సోదరుడు వారెన్ ఫెర్నాండెజ్ బ్యాంక్ ఖాతాలోకి 15 లక్షల రూపాయల మొత్తాన్ని బదిలీ చేసినట్లు కూడా ఆమె పేర్కొంది.
“సుకేష్ చంద్రశేఖర్ సురేష్ తపోరియా ద్వారా ‘ఎస్పూలా’ అనే గుర్రాన్ని కొనుగోలు చేసినట్లు కూడా ఆమె పేర్కొంది. ఈ గుర్రం కోసం 53లక్షలు చెల్లించారు.అయితే కాలక్రమంలో ఈ కాన్-మ్యాన్ తో జాక్వెలిన్ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంది. ఇంతకుముందు సుకేష్ ని అతని బుగ్గలపై ముద్దుపెట్టుకున్న చిల్లింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయిన అనంతరం జాక్విలిన్ కి కష్టాలు మొదలయ్యాయి.
కాన్ మ్యాన్ తో జాకీకి పనేంటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా ఈ కేసులో లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. కథానాయికలకు ఖరీదైన కానుకలు ఎర వేయడంలో సుకేష్ భార్యామణి లీనా పాల్ కీలక వ్యక్తి అని వెల్లడించడం మరింత విస్తుపోయేలా చేస్తోంది.