జాక్వెలిన్ కి ఊర‌ట‌..విదేశాల‌కు అనుమ‌తి

Update: 2021-12-06 14:30 GMT
బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ 200 కోట్ల కుంభ‌కోణంలో ఈడీ విచార‌ణ ఎదుర్కోంటున్న నేప‌థ్యంలో ఆదివారం దుబాయ్ కి ప‌య‌న‌మ‌వ్వ‌డం..అక్క‌డ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకోవ‌డంతో సీన్ మారిన సంగ‌తి తెలిసిందే. సుకేష్ చంద్ర‌తో సంబంధాలు కార‌నంగా పోలీసులు దేశం విడిచి వెళ్ల‌డానికి వీలు లేదంటూ  లుకౌట్  నోటీసులు జారీ చేసారు. దీంతో జాకీ ట్రిప్  క్యాన్సిల్ అయింద‌నుకున్నారంతా. అయితే ఇప్పుడా స‌న్నివేశం తారుమారైంది. ఆదివారం ఈడీ అదుపులోకి  వెళ్లిన జాకీకి తాజాగా ఊర‌ట ల‌భించింది. కొన్ని గంట‌ల విచారణ అనంత‌రం ఆమెను విడిచిపెట్టి..విదేశాల‌కు వెళ్లేంద‌కు ఎలాంటి అడ్డంకి లేద‌ని  అనుమ‌తులు జారీ చేసారు.

దీంతో జాక్వెలిన్ విచార‌ణ‌ అనంత‌రం నేరుగా  దుబాయ్ ప్లైట్ ఎక్కిన‌ట్లు  తెలుస్తోంది. స‌ల్మ‌న్ ఖాన్ `ద‌బాంగ్` షోని దుబాయ్ లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ సెల‌బ్రిటిలంతా షోకి హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో జాకీకి ఆహ్వానం అందింది. ఈడీ కూడా క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంతో ఆమె కూడా షోకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.  అయితే కేవ‌లం ఈ షోకి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారా?  ఇత‌ర దేశాలు వెళ్ల‌డానికి కూడా ఆంక్ష‌లు తొల‌గించారా? అన్న దానిపై స్ప‌ష్ట‌త  రావాల్సి ఉంది. కేసు న‌డుస్తోంది కాబ‌ట్టి జాకీని ఈడీ అంత సుల‌భంగా వ‌దిలిపెట్ట‌దు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కాక త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే ఆమె ఖాతాలో  10 కోట్లు జ‌మ అయిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. సుకేష్ తో జాకీ అత్యంత స‌న్న‌హితంగా మెలిగిన ఫోటోలు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ అభియోగం జాకీ కెరీర్ పై కూడా ప‌డుతోంది. క‌మిట్ అయిన సినిమాలు ఒక్కొక్క‌టిగా చేజారిపోతున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది.  అలాగే మ‌రో న‌టి నోరా ప‌తేహీ కూడా కేసులో విచార‌ణ ఎదుర్కోంటుంది. అయితే ఆమె మాత్రం సల్మాన్ షోకి వెళ్తున్న‌ట్లు లేదు. లేదంటే ఆమె పేరు కూడా వినిపించేది.
Tags:    

Similar News