శ్రీలంకన్ బ్యూటీ టాలీవుడ్ లో కూడా పాగా వేయబోతోందా..?
జాక్వెలిన్ ఫెర్నాండెజ్... హిందీ సినిమాల్లో నటిస్తూ తన అందచందాలతో మతిపోగుడుతోన్న శ్రీలంకన్ బ్యూటీ. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకన్ మాజీ మిస్ యూనివర్స్ అన్న సంగతి తెలిసిదే. ఈ ముద్దుగుమ్మ పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించింది. 'అలాడిన్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాక్వెలిన్ హిట్టు - ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. అందం అభినయం జాక్వెలిన్ సొంతం. హీరోయిన్ గా మాత్రమే నటిస్తా అని పట్టుపట్టకుండా చిన్న చిన్న పాత్రలతో పాటు.. ఐటమ్ సాంగ్స్ తోనూ కుర్రకారు మనసు దోచుకుంటోంది ఈ బాలీవుడ్ భామ. 'మర్డర్ 2' 'హౌస్ ఫుల్ 2' 'రేస్ 2' 'రేస్ 3' 'కిక్' 'రాయ్' 'బ్రదర్స్' 'హౌస్ ఫుల్ 3' 'జుద్వా 2' 'డ్రైవ్' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘సాహో’లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఓ పాటలో మెరిసిన జాక్వలిన్ మన సౌత్ ఆడియన్స్ కి కూడా పరిచయమైంది.
'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే ఐటెమ్ సాంగ్ లో తన అంద చందాలతో చంపేసింది. కానీ ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే 'సాహో' రిజల్ట్ ఈ బ్యూటీ పై తెలుగు ఆడియెన్స్ దృష్టిని మరల్చలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా వెబ్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీ. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’లో మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి నటించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ బ్యూటీ కొత్త లుక్స్ కి ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. 'మిసెస్ సీరియల్ కిల్లర్' ఒరిజినల్ సిరీస్ కి పెద్దగా ఆదరణ దక్కకపోయినప్పటికీ జాక్వీలిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని బాలీవుడ్ ఫోక్స్ అంటున్నారు. అలానే తన కోస్టార్ట్స్ తో కంఫర్ట్ బుల్ గా ఉండే జాక్వెలిన్ తాను యాక్ట్ చేసిన ఈ ఒరిజినల్ ఫిల్మ్ లాంఛింగ్ టైమ్ లో విషెస్ మాములుగా రాలేదు. సల్మాన్ భాయ్ కూడా జాకీ ఫ్యాన్స్ లిస్ట్ లో ఉండటం విశేషం. తెలుగులో కూడా జాక్వెలిన్ ని ఓ చూపు చూస్తే క్రైసిస్ తరువాత థియేటర్లకి రసిక ప్రియుల్ని ఆకర్షీంచడంలో ఉపయోగపడుతుందేమో కదా.
ఇదిలా ఉండగా జాక్వెలిన్ ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నది. ఈమెతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కబోయే పీరియాడికల్ మూవీలో కూడా నటించబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో తన సత్తా చూపిన ఈ బ్యూటీ సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాతో పాగా వేస్తుందేమో చూడాలి.