ఇప్పటికీ తెలుగు రాయడం రాని టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో ‘సహజనటి’గా గుర్తింపు తెచ్చుకుని, కొన్ని దశాబ్దాలుగా వందలాది సినిమాల్లో అద్భుతంగా నటించిన సీనియర్ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2026-06-22 15:30 GMT

తెలుగు ఇండస్ట్రీలో ‘సహజనటి’గా గుర్తింపు తెచ్చుకుని, కొన్ని దశాబ్దాలుగా వందలాది సినిమాల్లో అద్భుతంగా నటించిన సీనియర్ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకు ఇప్పటికీ తెలుగు చదవడం, రాయడం రాదనే ఒక నమ్మలేని నిజాన్ని బయటపెట్టారు. 350కి పైగా తెలుగు సినిమాలు చేసిన ఒక స్టార్ హీరోయిన్ నోట ఈ మాట వినడంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

పాడ్‌క్యాస్ట్‌లో బయటపడ్డ సీక్రెట్:

నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేస్తోన్న ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో జయసుధ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. "నాకు ఇప్పటివరకు తెలుగు రాయడం కానీ, చదవడం కానీ రాదు" అని చెప్పారు. ఇక మొన్నటికి మొన్న కూడా ట్రై చేస్తే.. ‘జయసుధ’ అని రాయబోయి ‘జభసుధ’ అని తప్పుగా రాశానని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు.

తమిళం, ఇంగ్లీష్ వచ్చు కానీ.. తెలుగు ఎందుకు రాలేదు?:

తాను చెన్నైలో తమిళ్, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నానని, అందుకే ఆ రెండు భాషలు బాగా వచ్చని జయసుధ తెలిపారు. తమిళంలో కేవలం 18 అక్షరాలే ఉంటాయి కాబట్టి అది చాలా ఈజీగా వచ్చేసిందని, కానీ తెలుగులో 56 అక్షరాలు ఉండటం వల్ల నేర్చుకోవడం కష్టమైందని చెప్పారు. అంతేకాదు, "నేను జిలేబీలు చూసిన ప్రతిసారీ నాకు తెలుగు అక్షరాలే గుర్తొస్తుంటాయి.. అంత కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి" అంటూ సరదాగా తెలిపారు.

డైలాగ్స్ ఎలా చెప్పేవారు? దేవుడిచ్చిన గిఫ్ట్:

ఇక భాష రాయడం, చదవడం రాకపోయినా మరి అన్ని వందల సినిమాల్లో అంత పెద్ద పెద్ద డైలాగులు ఎలా చెప్పారు? అనే డౌట్ అందరికీ రావచ్చు. దానికి జయసుధ సమాధానం ఇస్తూ.. దేవుడు తనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని అన్నారు. ఇక ఎవరైనా డైలాగ్స్ చెప్తుంటే వాటిని శ్రద్ధగా విని, మనసులో గుర్తుపెట్టుకుని కెమెరా ముందు అద్భుతంగా చెప్పడం తనకు అలవాటని, ఆ టాలెంట్‌తోనే ఇన్నేళ్లు మేనేజ్ చేశానని క్లారిటీ ఇచ్చారు.

నెట్టింట వైరల్.. నెటిజన్ల రియాక్షన్:

జయసుధ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండి, 9 నంది అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న ఒక లెజెండరీ నటికి కనీసం సొంత పేరు కూడా తెలుగులో రాయడం రాకపోవడం ఏంటని కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు మాత్రం రాయడం రాకపోయినా అంత అద్భుతంగా హావభావాలు పలికించారంటే ఆమె గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు.

భాష రాయడం, చదవడం వేరు.. ఆ భాషలోని భావాన్ని అర్థం చేసుకుని నటించడం వేరని జయసుధ గారు నిరూపించారు. అక్షరాలు రాకపోయినా, కేవలం విని గుర్తుపెట్టుకునే అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సహజనటి’గా స్థానం సంపాదించుకోవడం నిజంగా గ్రేట్ కదా..

Tags:    

Similar News