బాలీవుడ్ ముచ్చటః ప్రియాంక చోప్రా ఇంట్లోకి వెళ్లిన జాక్వెలిన్..!
బీ-టౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ.. ఆమె ముంబైలోనే కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. ఫేమస్ బాంద్రా ఏరియాలోని రెంట్ హౌస్ లో ఉంటోందీ బ్యూటీ. చాలా కాలంగా తన రేంజ్ కు తగిన ఇంటికోసం సెర్చ్ చేస్తోందీ బ్యూటీ. ఎట్టకేలకు తనకు నచ్చిన ఇల్లు దరొకడంతో కొనేసింది. అది ఎవరిదో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాది!
గతంలో ప్రియాంక అందులో నివాసం ఉన్నారు. ఆమె పెళ్లయ్యే వరకూ అక్కడే ఉన్నారు. 2018 లో అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌తో వివాహం అనంతరం ఆమె ఈ ఇంటిని వదిలిపెట్టారు. రూ.7 కోట్లు విలువ కలిగిన ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ హౌస్ ఎంతో విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఈ ఇంట్లో బాల్కనీ హైలెట్ గా నిలుస్తుంది. ఆ బాల్కనీలో నిలబడితే ముంబై వ్యూ మొత్తం అద్బుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మిగిలిన సౌకర్యాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి.
తన వివాహం తరువాత, భర్త నిక్‌తో కలిసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన భవనం కొనుగోలు చేసింది ప్రియాంక. శాన్ ఫెర్నాండో వ్యాలీలో ఉన్న ఆ బిల్డింగ్ ను 20 మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఎంతో విలాసవంతమైన ఈ ఇంట్లోని వస్తువులన్నీ లగ్జరీగా ఉంటాయి. ఎంతగా అంటే.. ఈ ఇల్లు కొనుగోలు చేసినప్పుడు.. మీడియాలో హెడ్ లైన్స్ నిలిచారు ప్రియాంకా నిక్.
దీంతో.. ముంబైలోని ఇల్లు ఖాళీ అయ్యింది. ఇక, కొన్ని సంవత్సరాలుగా మంచి ఇంటికోసం వెతుకుతున్న జాక్వెలిన్.. చివరకు ప్రియాంక ఇంటిని ఎంచుకుంది. సోషల్ మీడియాతోపాటు ఆన్ స్క్రీన్ లోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న జాక్వెలిన్.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘భూత్ పోలీస్’తోపాటు.. రణ్‌వీర్ సింగ్ సరసన నటిస్తున్న ‘సర్కస్’ చిత్రంతో బిజీగా ఉంది జాక్వెలిన్.