అప్ సైడ్ డౌన్! ఏంటమ్మా జాకీ ఈ సినిమాలు!!
ఏంటీ జాకీ `అప్ సైడ్ డౌన్` ఫీట్! నిండా ప్రేమలో మునిగిందా? ఏమో..! బ్యాడ్ బోయ్ అంటూ ఇంతకుముందు `సాహో` యాక్షన్ వీరుడి వెంట పడింది. ఒక్క బౌన్సర్ తోనే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్ని క్లీన్ స్వీప్ చేసేసింది. జాకీ హంసనడకల వయ్యారానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.
అదంతా సరే కానీ.. ఇప్పుడీ అప్ సైడ్ డౌన్ ఫీట్ దేనికి? అంటే...ఇదో రకం ఎక్సర్ సైజ్. కసరత్తు ఫోటోషూట్ అన్నమాట. అన్నట్టు అప్ సైడ్ డౌన్ అంటే 2012తో రిలీజైన హాలీవుడ్ సినిమాని ఓమారు తలవాల్సిందే. గురుత్వాకర్షణ సిద్ధాంతం.. లవ్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ కెనడియన్ ఫ్రెంచ్ రొమాంటిక్ డ్రామాకి 6.5/10 రేటింగుతో ఐఎండీబీ గౌరవించింది.
ఇంతకీ అప్ సైడ్ డౌన్ స్టోరీ ఏమిటి? అంటే.. ఆడమ్ -ఈడెన్ యుక్తవయసులో ప్రేమలో పడతారు. ఆ తర్వాత విడిపోయి మళ్లీ కలుస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ జంట రెండు డిఫరెంట్ ప్రపంచాలలో విభిన్నమైన గురుత్వాకర్షణ ఉన్న గ్రహాల్లో నివసిస్తారు. ఆ గ్రహాలు రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశల్లో అంతరిక్షంలో నిశ్చలంగా నిలిచి ఉంటాయి. అన్ని ప్రేమకథల్లానే .. బలవంతంగా విడిపోయే ఈ ప్రేమ జంట కూడా పది సంవత్సరాల తరువాత తిరిగి ఎలా కనెక్టయ్యారన్నదే సినిమా. ఆడమ్ తన ప్రేమతో తిరిగి కనెక్ట్ కావడానికి ప్రమాదకరమైన అన్వేషణకు బయలుదేరాక ఏం జరిగిందనేది ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో రూపొందించారు. జువాన్ సోలనాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే. జిమ్ స్టుర్గెస్- కిర్ స్టన్ డన్స్ట్- తిమోతి స్పాల్ తారాగణం.