• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా ప్లేస్ ను భర్తీ...

తమన్నా ప్లేస్ ను భర్తీ చేసిన జబర్దస్త్‌ యాంకర్‌

By - Tupaki Desk
Update: 2021-10-04 11:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌ గా మొదటి సారి చేసిన షో మాస్టర్ చెఫ్‌. జెమిని టీవీ ఈ షో ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించడం జరిగింది. తమన్నాకు భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు జడ్జ్‌ లకు పెద్ద మొత్తంలో పారితోషికాలు ఇస్తూ షో ను భారీ ఎత్తున నిర్వహించారు. షో ను వారంలో రెండు రోజులు టెలికాస్ట్‌ చేస్తూ ఉన్నారు. మొదటి రెండు వారాల పాటు మాస్టర్ చెఫ్‌ కు కాస్త గౌరవ ప్రథమైన రేటింగ్‌ వచ్చింది. కాని ఆ తర్వాత నుండి రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. షో కు రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ప్రయోజనం దక్కలేదట. పెట్టిన పెట్టుబడికి కనీసం సగం కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోవడంతో ఇక చేసేది లేక తమన్నా ను షో నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి.

ఆమె పారితోషికం భారీ మొత్తంలో ఉండటం వల్ల ఆమెకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ ముగించి తదుపరి ఎపిసోడ్స్ కు గాను జబర్దస్త్‌ యాంకర్ అనసూయను రంగంలోకి దించడం జరిగింది. మాస్టర్ చెఫ్‌ హోస్ట్‌ మారడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తమన్నా ప్లేస్ ను అనసూయ భర్తీ చేసింది అంటే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. షో యూనిట్‌ సభ్యులు మాత్రం తమన్నా కాల్షీట్లు లేని కారణంగా చివరి ఎపిసోడ్స్ ను అనసూయతో చేయిస్తున్నామని చెబుతున్నారు. కాని అసలు విషయం ఆమె షెడ్యూల్స్ ప్రకారం పారితోషికంను తీసుకుంటుంది. ఇటీవల ప్రసారం అయిన ఎపిసోడ్స్ తో ఆమె షెడ్యూల్‌ షూటింగ్‌ ముగిసింది. మళ్లీ కొత్త షెడ్యూల్‌ వేసి చిత్రీకరణ చేయాలంటే ఆమెను ఆహ్వానించాలి. అందుకు భారీగా పారితోషికం కావాల్సి వస్తుంది. అందులో కొద్ది మొత్తంకే అనసూయ వచ్చేస్తుంది కనుక ఈ మార్పు జరిగింది అనేది జెమిని వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసి జెమిని వారు మాస్టర్‌ చెఫ్‌ ను ప్రారంభించారు. ఇతర భాషల్లో పెద్ద సక్సెస్ అయిన మాస్టర్‌ చెఫ్‌ ఖచ్చితంగా తెలుగు లో కూడా సెన్షేషనల్‌ రేటింగ్‌ దక్కించుకుంటుందని అంతా ఊహించారు. కాని అనూహ్యంగా షో కు రేటింగ్‌ దారుణంగా ఉంది. మాస్టర్ చెఫ్‌ మరియు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను కూడా ఒకే వారంలో ప్రారంభించారు. రెండు షో లతో జెమిని టీవీ రేటింగ్‌ లో దూసుకు పోతుందని అంతా భావించారు. కాని అనుకున్నది ఏమీ జరగలేదు. షో నిర్వాహకులు తీవ్రంగా నిరుత్సాహంలో ఉన్నారు. మాస్టర్‌ చెఫ్‌ ఫినాలే ఎపిసోడ్‌ లో అయినా తమన్నాను తీసుకు వస్తారా అనేది చూడాలి.
Tags:    
  • MasterChef 
  • MasterChef gemini tv 
  • Tamannah Bhatia 
  • Anasuya Bharadwaj 
  • Anasuya Bharadwaj MasterChef 
  • Anasuya Bharadwaj Movies 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS