`అర్జున్ రెడ్డి` కాంబినేషన్ రౌడీ ప్లాన్ తెలిస్తే షాకే
`అర్జున్ రెడ్డి` చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన జోడీ విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగ. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ కాలేదు. ఈ గ్యాప్ లో ఎవరికి వారు కెరీర్ ప్లానింగ్ లో బిజీ అయిపోయారు. అయితే ఇన్నాళ్టికి ఆ ఇద్దరూ కలుస్తున్నారు. ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ నటించడం లేదు. కేవలం నిర్మాతగా కొనసాగుతారు. `అర్జున్ రెడ్డి`తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ ఇదే చిత్రాన్ని హిందీలో `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ చేస్తే దేశ వ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ ల వర్షం కురిపించడమే కాకుండా హీరో షాహీద్ కపూర్ మార్కెట్ స్థాయిని కూడా పెంచింది. హీరోగా అతని కెరీర్ నే మార్చేసింది. ఇక వెబ్ సిరీస్ తో సందీప్ వంగ కొత్త స్టార్లకు లైఫ్ ఇస్తాడేమో చూడాలి.
సందీప్ - విజయ్ దేవరకొండ కలిసి వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారంటే దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ ఉంటుందనడంలో సందేహమేం లేదు. బాలీవుడ్ లో మరో సినిమా కోసం రెడీ అవుతున్న సందప్ వంగ మిడిల్ లో గ్యాప్ ని వెబ్ సిరీస్ తో ఫిల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ హీరో ఎవరు? అంటే.. ఇంకెవరు.. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండనే. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని సందీప్ వంగ త్వరలోనే వెల్లడించనున్నారట.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ బిఫోర్ కీలక ఘట్టాలతో పాటు బైక్ ఛేజింగ్ దృశ్యాలని ముంబై వీధుల్లో చిత్రీకరించారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.