• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లాస్ట్ మంత్.. రజినీకాంత్...

లాస్ట్ మంత్.. రజినీకాంత్ వచ్చేస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2020-11-18 17:30 GMT
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ మొత్తం మూతపడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సినిమాలకు బ్రేక్ నిచ్చాడు. అతని రాబోయే చిత్రం ‘అన్నాట్టే’ బృందం కూడా షూటింగ్ ను నిరవధికంగా నిలిపివేసింది. రజనీకాంత్ త్వరలో దాన్ని తిరిగి ప్రారంభించే మూడ్ లో లేడని తాజాగా వార్తలు వచ్చాయి..

అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను ఉత్సాహపరిచే వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘అన్నాట్టే’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తేదిని నిర్ణయించనప్పటికీ.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మూవీ మేకర్స్ ఒక నెల షెడ్యూల్‌ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఒక నెల షూటింగ్ పూర్తయితే చిత్రం మొత్తం షూట్ అయిపోతుందని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సెట్ వేసే పనులు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయని సమాచారం..

రజనీకాంత్ షూటింగ్ తేదీని ప్రకటించగానే చివరి షెడ్యూల్ ను పూర్తి చేయడానికి సెట్ కు వస్తాడని యూనిట్ తెలిపింది.. మిగతా యాక్టర్ల డేట్స్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. తద్వారా కొత్త షెడ్యూల్ ఇక ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

దీంతో ఈ మూవీ పూర్తి చేయడంతోపాటు కొత్త సినిమాలకు, రాబోయే తమిళనాడు ఎన్నికలకు సన్నాహాలు చేయడానికి రజనీకాంత్‌కు కూడా ఉపయోగపడుతుంది. అందుకే సూపర్ స్టార్ ఈ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

అన్నాట్టే తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో నిర్మించిన గ్రామీణ నేపథ్యం ఉన్న కథ. సుదీర్ఘ గ్యాప్ తరువాత, రజనీకాంత్ మళ్లీ షూటింగ్ కు రాబోతున్నాడు.విశ్వాసం సినిమా ఫేం శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్, నయనతార, మీనా.. ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నాటకాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
Tags:    
  • Rajinikanth 
  • Annaatthe 
  • Shooting 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS