సోహెల్‌ కు మెహబూబ్‌ కాదు బిబి టీం హింట్ ఇచ్చినట్లుంది

Update: 2020-12-23 03:48 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 ఫినాలే ఎపిసోడ్‌ రసవత్తరంగా సాగింది. టాప్‌ 2 లో ఉంటాడని అనుకున్న సోహెల్‌ నెం.3 స్థానం చాలు నాకు అంటూ పాతిక లక్షలతో బయటకు వచ్చేశాడు. మొదట 20 లక్షలు అన్నారు.. ఆ తర్వాత 25 లక్షలకు ఆ మొత్తం పెంచారు. టెలికాస్ట్‌ కాని విషయం ఏంటీ అంటే మా లో ఆఫర్‌ నీకోసం ఎదురు చూస్తుందని కూడా నాగ్‌ అన్నారట. సోహెల్‌ ఎలాగైనా ఆ మొత్తం తీసుకోవాలని నాగార్జున అండ్‌ బిగ్‌ బాస్ టీం బలంగా కోరుకున్నారట. అందుకే ఆయనకు పలు హింట్స్‌ కూడా ఇచ్చారనే ఆరోపణ వినిపిస్తుంది. సోహెల్‌ విజేతగా నిలువకున్నా కూడా ఆయనకు వచ్చిన ప్రైజ్‌ మనీ మరియు నాగ్‌ చిరులు ఇచ్చిన డబ్బుతో కలిపి మొత్తంగా 45 లక్షలు అయ్యింది. అంటే విన్నర్‌ అభిజిత్‌ కంటే ఎక్కువే. ఇదంతా కూడా బిగ్ బాస్‌ టీం ఆడిన ఆట అంటున్నారు.

సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అభిజిత్‌ వితేజ అవ్వడం టీంకు ఇష్టం లేదట. కెప్టెన్‌ గా అవ్వలేక పోయాడు.. టాస్క్‌ లు పూర్తిగా చేయలేదు.. ఒక టాస్క్‌ ను అసలు చేయనంటూ బిగ్‌ బాస్ ఆదేశాన్ని దిక్కరించాడు ఇంకా అతడి వల్ల పెద్దగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ వచ్చింది కూడా లేదు. అలాంటి వ్యక్తి విన్నర్‌ అయితే ఒక వర్గం వారు విమర్శించే అవకాశం ఉంది. కాని విజేత అవ్వకుంటే సోషల్‌ మీడియాలో అభిజిత్ ఆర్మీ ఏకి పడేయడం ఖాయం. అందుకే అభిజిత్‌ పీఆర్ టీం నోరు మూయించే విధంగా విన్నర్‌ గా ప్రకటించారు. కాని అసలు విజేత సోహెల్‌ అన్నట్లుగా ప్రేక్షకుల్లో భావన కలిగే విధంగా చేశారు.

సోహెల్‌ కు మెహబూబ్‌ టాప్ 3 లో వచ్చేయ్‌ అంటూ హింట్ ఇచ్చాడని వీడియో స్కాం అంటూ అభిజిత్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. కాస్త లోతుగా విశ్లేషిస్తే సోహెల్‌ కు మెహబూబ్‌ కాకుండా బిబి టీం హింట్‌ ఇచ్చిందేమో అంటూ కొందరు బిగ్‌ బాస్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోహెల్‌ అందరి మనసులను దోచుకున్నాడు. కాని ఓట్ల పరంగా మాత్రం నెం.2 లో నిలిచాడు. అతడికి ఎక్కువ వచ్చేలా చేయడం వల్ల బ్యాలన్స్ చేసినట్లు అవుతుందని బిబి4 టీం భావించి ఇలా స్కెచ్‌ వేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News