• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇష్క్' రెగ్యులర్ తెలుగు...

'ఇష్క్' రెగ్యులర్ తెలుగు సినిమా కాదు.. చాలా అరుదుగా వచ్చే చిత్రం: తేజ సజ్జా

By - Tupaki Desk
Update: 2021-07-24 13:30 GMT
'జాంబిరెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో తేజ సజ్జ.. ఇప్పుడు ''ఇష్క్'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి రీమేక్. ఎస్‌.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూలై 30న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన పరిస్థితుల్లో ధైర్యం చేసి థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్న మొదటి హీరో తేజ సజ్జ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన తేజ 'ఇష్క్'- నాట్ ఏ లవ్ స్టోరీ చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు.

- 'ఇష్క్' కొత్త రకమైన కంటెంట్ తో న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్ రూపొందిన సినిమా. హీరో హీరోయిన్ లు ఇలా ఉండాలి.. కథ ఇలా ఉండాలి.. అనే రెగ్యులర్ తెలుగు సినిమాలను బ్రేక్ చేసే చిత్రమిది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనే థ్రిల్ ఉంటుంది. 1 గంటా 55 నిమిషాల నిడివితో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థిల్లర్ గా ఉండబోతోంది.

- మలయాళ వెర్సన్ లో మార్పులు చేశాం కానీ.. కథలో మాత్రం ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఒరిజినల్‌ తో పోలిస్తే సినిమా రన్‌ టైమ్‌ ను తగ్గించి ఇంకా గ్రిప్పింగ్ ఉండేలా సినిమాని రెడీ చేశాం. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. 'ఓ బేబీ' 'జాంబిరెడ్డి' చిత్రాల్లో అందరితో పాటు తేజ బాగా చేసాడని అన్నారు. కానీ ఈ సినిమాతో ప్రత్యేకంగా నా గురించే మాట్లాడతారు.

- కరోనా రెండవ వేవ్ సమయంలో సినిమా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతుందనే దాని గురించి అందరూ ఆలోచించారు. కానీ చివరకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి వారి కంటే బెటర్ గా సినిమాని ఎవరు రిలీజ్ చేయగలరు అనుకున్నాను. ఎన్.వి.ప్రసాద్ గారు ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్. వారి కంటే సినిమాని విడుదల గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది?.

- నేను భవిష్యత్తు ఎలా ఉంటుందని కొంచెం భయపడ్డాను కానీ 'ఇష్క్' సినిమా గురించి మాత్రం ఆందోళన లేదు. ఎందుకంటే ఇది మంచి కంటెంట్ తో తీసిన సినిమా. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. నాకు మంచి పేరు వస్తుందని, సినిమా విడుదలైన తర్వాత గుర్తింపు లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందువల్ల నేను ఈ సినిమా గురించి నిజంగా చింతించలేదు.
Tags:    
  • Teja Sajja 
  • Ishq 
  • Movie News 
  • Tollywood 
  • Telugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS