పవర్ స్టార్ దర్శకుల ఆర్డర్ మారబోతోందా..? పవర్ స్టార్ లైనప్ లో మార్పులు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన 'పింక్' రీమేక్ ''వకీల్ సాబ్'' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ''హరి హర వీరమల్లు'' సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తో ఓ మూవీ కమిట్ అయ్యారు. అలానే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అయితే అదే సమయంలో మలయాళ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' సినిమా నచ్చడంతో.. డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ని ముందుకు తీసుకొచ్చాడు పవన్.
ప్రస్తుతం 'వీరమల్లు' మరియు 'ఏకే' రీమేక్ లు సెట్స్ పై ఉండగా.. కరోనా ప్రభావంతో షూటింగ్స్ ఆగిపోయాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరగా సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్న పవన్ కు కోవిడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడు ఎవరెవరికి డేట్స్ అడ్జస్ట్ చేస్తాడు.. ఏ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ సినిమాల లైనప్ ముందుగా అనుకున్నట్లు ఉండకపోవచ్చు. డైరెక్టర్స్ లిస్ట్ లో వెనకున్న వాళ్ళు ముందుకు రావొచ్చు.. ముందున్న వాళ్ళు వెనక్కి పోవచ్చు.
'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ 45 శాతానికి పైగా పూర్తయ్యింది. 2022 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించినప్పటికీ.. ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ ఉండటం.. వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉండటంతో కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అందులోనూ ముందుగా ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న 'ఏకే' రీమేక్ ని ముందుగా కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇక హరీష్ శంకర్ - సురేందర్ రెడ్డి కూడా పవన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు నచ్చడంతో పవన్ ముందుగా ఏ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ముందుగా సూరి సినిమా చేయాలని పవన్ అనుకుంటే, హరీష్ లిస్ట్ లో చివరకు వెళ్లిపోయే అవకాశం ఉంది. హరీష్ సినిమా ముందుకు వెళ్తే సురేందర్ రెడ్డి లాస్ట్ కి వెళ్తాడు. మధ్యలో బండ్ల గణేష్ మంచి కథతో దర్శకుడిని తీసుకొస్తే పవన్ ఆలోచన మారినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడితే.. పవన్ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ దర్శకుల జాబితాలో ఎవరి నెంబర్ ఏదో త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.