ఆ డైరెక్టర్ పై అక్కినేని ఫ్యాన్స్ ఆశలు
టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తర్వాత 20 ఏళ్ల పాటూ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా నిలిచిన వారెవరయా అంటే ఎవరైనా చెప్పే పేర్లు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.;
టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు తర్వాత 20 ఏళ్ల పాటూ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా నిలిచిన వారెవరయా అంటే ఎవరైనా చెప్పే పేర్లు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున. ఒకప్పుడు వీళ్లే టాలీవుడ్ కు మూల స్థంభాలు. అలాంటి ఈ స్టార్లు ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు సీనియర్ డైరెక్టర్లైన కోదండ రామిరెడ్డి, ఈవీవీ, రాఘవేంద్రరావు లాంటి వారు ఈ నలుగురితో సినిమాలు చేశారు.
ముగ్గురు సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన అనిల్
ఆ తర్వాత ఈ జెనరేషన్ డైరెక్టర్లలో ఎవరూ ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేసింది లేదు. వి. వి వినాయక్ నాగ్ తో తప్ప మిగిలిన వారితో సినిమాలు చేస్తే, శ్రీను వైట్ల బాలయ్యతో వర్క్ చేయలేదు. అయితే వినాయక్, శ్రీను వైట్ల తర్వాత ఇప్పుడు ఆ నలుగురు సీనియర్ స్టార్ హీరోల్లో ముగ్గురిని డైరెక్ట్ చేసిన రికార్డు అనిల్‌కే ఉంది. ఇప్పటికే వెంకీ, బాలయ్యతో సినిమాలు చేసిన అనిల్, చిరూతో మన శంకరవరప్రసాద్ గారు చేశారు.
నాగ్ తో సినిమా చేస్తే రికార్డే
అంటే సీనియర్ హీరోల్లో అనిల్ ముగ్గురు హీరోలను కవర్ చేశారు. ఇక నాగార్జునతో కూడా సినిమా చేస్తే నలుగురు హీరోలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గా అనిల్ రికార్డు సాధించొచ్చు. నాగ్ తో సినిమా చేసి ఆ రికార్డు సాధించాలని అందరూ అనిల్ కు చెప్తుండగా, అనిల్ కూడా తాను నాగ్ తో సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. నాగ్ తో సినిమా చేస్తానని, కానీ అది ఎప్పుడనేది చెప్పలేనని చెప్తున్న అనిల్, తన తర్వాతి సినిమా ఎవరితో అనేది ఇంకా తెలియదని చెప్పడంతో నాగ్ ఓకే అంటే అనిల్ నెక్ట్స్ ప్రాజెక్టు అక్కినేని హీరోతోనే ఉండే ఛాన్సుంటుంది.
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ తో తన 100వ సినిమాను చేస్తున్న నాగ్, ఆ సినిమా పూర్తైన వెంటనే అనిల్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటే ఈ లోపు అనిల్ కూడా కథ, మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉంటారు. సీనియర్ హీరోల మ్యానరిజమ్స్ ను సరిగ్గా వాడుకునే అనిల్ తో సినిమా చేస్తే తమ హీరోకు కూడా కెరీర్ బెస్ట్ మూవీ పడుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఈ కాంబో ఎంత త్వరగా కుదిరితే అంత బావుంటుందని ఆశ పడుతున్నారు.