నేచురల్ స్టార్ కి రిపీట్ చేయడం నచ్చదా?
హీరో-హీరోయిన్ హిట్ కాంబినేషన్స్ అన్నవి కొంత మంది దర్శక, హీరోలు సెంటిమెంట్ గా భావిస్తుంటారు. నటీన టుల ఎంపిక అన్నది కథ ఆధారంగా జరిగినా? హీరోయిన్ ఎంపిక విషయంలో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది.;
హీరో-హీరోయిన్ హిట్ కాంబినేషన్స్ అన్నవి కొంత మంది దర్శక, హీరోలు సెంటిమెంట్ గా భావిస్తుంటారు. నటీన టుల ఎంపిక అన్నది కథ ఆధారంగా జరిగినా? హీరోయిన్ ఎంపిక విషయంలో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఏ హీరోయిన్ తీసుకుంటారు? అన్న దానిపై దర్శక, హీరోల మధ్య కొంత డిస్కషన్ జరుగుతుంది. ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో హీరో కూడా కొంత మంది హీరోయిన్ల పేర్లను సూచి స్తాడు. దర్శకుడు కూడా తాను రాసిన పాత్రకు ఎవరైతో సరిపోతారో హీరోతో డిస్కస్ చేస్తాడు.
ఈ విధానం అన్నది అన్నీ పరిశ్రమల్లో అమలులో ఉన్నది. దర్శకులు వీలైనంత వరకూ హీరో సూచించిన వారినే తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో కొంత మంది హీరోలు రీపీటెడ్ భామల్నీ ఇష్టపడుతుంటారు. వాళ్లతో కలిసి పని చేస్తే హిట్ అవుతుందని నమ్ముతుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం హీరోయిన్ ఎంపిక విషయంలో ఎలాంటి సెంటిమెంట్లు నమ్మడు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ ఎవర్ని తీసుకోవాల న్నది కొంత వరకూ ఇన్వాల్స్ అవుతారుట. కానీ దర్శకుడిపై మాత్రం ఫలానా హీరోయిన్ నే తీసుకుందామని ఒత్తిడి తీసుకురాడుట.
ప్రత్యేకించి ఆల్రెడీ నటించిన హీరోయిన్ అయితే లైట్ తీసుకోమంటాడుట. వీలైనంత వరకూ ప్రెష్ హీరోయిన్ అయితే బాగుంటుందని సజ్జెస్ట్ చేస్తాడుట. సీనియర్స్ కంటే కొత్త వారితోనే కలిసి పనిచేయడాన్ని తాను కంపర్ట్ గా ఫీల్ అవుతాడుట. మరి నాని కెరీర్ లో ఇంత వరకూ ఎంతమంది హీరోయిన్లు రిపీట్ అయ్యారంటే ఇద్దరే ఇద్దరు కనిపిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `నేను లోకల్` సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్ లో `దసరా` తెరకెక్కింది.
ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అనంతరం ప్రియాంక అరుల్ మోహన్ మళ్లీ రిపీట్ అయింది. `నానీస్ గ్యాంగ్ లీడర్` లో అమ్మడు జంటగా నటించింది. కానీ ఆసినిమా అంచనాలు అందుకోలేదు. అయినా ఫలితంతో సంబంధం లేకుండా నాని మరోసారి `సరిపోదా శనివారం`లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్ ఇద్దరు సౌత్ భామలే. ఒకసారి సక్సెస్..మరోసారి ఫెయిల్యూర్ వచ్చినా ఎంపిక చేసాడు? అంటే నాని హిట్ కాంబినేషన్స్ అన్నవి పెద్ద నమ్మడని తెలుస్తోంది.