ఇంత పోటీలో స్టార్ హీరోకి అంత అల‌స‌త్వమా?

Update: 2020-08-11 03:45 GMT
దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవాల‌ని అంటారు. కానీ ఆ స్టార్ హీరో వ్య‌వ‌హారం మాత్రం అస్స‌లు ఏమాత్రం స‌రిగా లేద‌న్న ఆవేద‌న అభిమానుల్లో క‌నిపిస్తోంది. వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌ను క్యూలో పెట్టి పోటీ ప్ర‌పంచంలో దూసుకుపోతున్న సాటి హీరోల విష‌యంలో ఏమాత్రం భ‌య‌ప‌డ‌డు. దానివ‌ల్ల జాగ్ర‌త్త కూడా లేకుండా పోయింద‌నేది ఫ్యాన్స్ ఆవేద‌న‌. ఇలా అయితే పాన్ ఇండియా రేసులో వెన‌క‌బ‌డ్డ‌ట్టేన‌న్న‌ది ఒక సెక్ష‌న్ ఫ్యాన్స్ వాద‌న‌.

ఓవైపు టాలీవుడ్ లో ఇత‌ర స్టార్ హీరోలంతా స‌క్సెస్ తో స్పీడ్ మీద ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ల‌ను క్యూలో పెట్టి వ‌రుస‌గా కాల్షీట్లు ఇచ్చి లాక్ చేసేస్తున్నారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే రేసులో ఉన్న ఇత‌ర స్టార్ హీరోలు పాన్ ఇండియా పాన్ వ‌ర‌ల్డ్ మూవీల‌తో అంత‌కంత‌కు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే స‌ద‌రు స్టార్ హీరో వైఖ‌రి ఏమిటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఒకే ఒక్క పాన్ ఇండియా మూవీతో లాక్ అయ్యి ఉన్న స‌ద‌రు స్టార్ హీరో ఎందుక‌ని త‌దుప‌రి సినిమాల ద‌ర్శ‌కుల్ని ప్ర‌క‌టించ‌రు. సాటి హీరోలు వ‌రుసగా స్క్రిప్టులు లాక్ చేసి ద‌ర్శ‌కులెవ‌రో చెప్పేస్తుంటే అత‌డు ఎందుక‌ని అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు? అంటే దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇక ఈ స్టార్ హీరోకి మ‌రో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది. ప్ర‌తిసారీ ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్లు కొట్టి ఆపై ప‌ర‌మ చెత్త సినిమాలు చేస్తుంటాడు. డిజాస్ట‌ర్ మూవీల్లో న‌టించి మార్కెట్ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాడు. అయితే ఇదంతా గ‌మ‌నించి అతడు స‌రిదిద్దుకుంటాడా?  దీపం ఉండ‌గానే త‌న‌ని తాను మార్చుకుని పాన్ ఇండియా పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో వెలుగుతాడా?  అటు హిందీ మార్కెట్ ని లైట్ తీస్కోకుండా త‌న రేంజును విస్త‌రిస్తాడా? అన్న‌ది చూడాలి. పోటీ ఠ‌ఫ్ గా ఉన్న‌ప్పుడు అల‌స‌త్వం త‌గ‌ద‌నేది ఫ్యాన్స్ సూచ‌న‌. మ‌రి పాటిస్తాడా?
Tags:    

Similar News