`పుష్ప‌`కి స్పైడ‌ర్ మ్యాన్` పోటీనా?

Update: 2021-12-13 23:30 GMT
హాలీవుడ్ నుంచి ఏ సినిమా వ‌చ్చినా స‌గ‌టు ప్రేక్ష‌కుడిలో మ‌న సినిమాల కుండే క్రేజ్ వేరు. హాలీవుడ్ నుంచి క్రేజీ మూవీ వ‌చ్చేస్తోంది క‌దా అని మ‌న సినిమాల‌ని తెలుగు ప్రేక్ష‌కుడు త‌క్కువ చేసిన సంద‌ర్భాలు కానీ .. ప‌క్క‌న పెట్టిన సంఘ‌ట‌న‌లు కానీ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే హోట‌ల్ లో ఎంత రుచిక‌ర‌మైన భోజ‌నం వున్నా అమ్మ చేతి వంట‌కే మ‌నం ప్రాధాన్య‌త‌నిస్తుంటాం.

అలాగే క్రేజీ హాలీవుడ్ సినిమాలు ఎన్నొచ్చినా మ‌న సినిమాల‌కుండే ప్ర‌త్యేకత వేరు.. మ‌న సినిమా చూడాల్సిందే. ఇదే తెలుగు ప్రేక్ష‌కుడిలో వున్న గొప్ప క్వాలిటీ.

అయితే దీనికి కొంత మంది వ‌క్ర భాష్యం చెబుతున్నారు. తాజాగా ఇలాంటి ప్ర‌చార‌మే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ `పుష్ప :ది రైజ్‌` విష‌యంలో జ‌రుగుతోంది.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇప్ప‌టికే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌.. పుష్ప‌రాజ్ మేకోవ‌ర్ కార‌ణంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్లు జ‌రిగి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో డిసెంబ‌ర్ 17న విడుద‌ల కాబోతోంది.

అయితే ఈ సినిమా విడుద‌ల రోజే అంటే డిసెంబ‌ర్ 17న శుక్ర‌వారం `స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌` చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్ గా విడుద‌ల కాబోతోంది. `స్పైడ‌ర్ మ్యాన్` సిరీస్ చిత్రాల్లో భాగంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా భారీ అంచనాలే వున్నాయి. తెలుగులో `స్పైడ‌ర్ మ్యాన్` సిరీస్ చిత్రాల‌కు మంచి క్రేజ్ వుంద‌న్న విష‌యం తెలిసిందే.

అయితే తెలుగు చిత్రాల‌ని మించి మాత్రం క్రేజ్ లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. మార్వెల్ స్టూడియోస్ చిత్రాల‌కు `స్పైడ‌ర్ మ్యాన్` సిరీస్ చిత్రాలకు ఇండియా వ్యాప్తంగా ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నాయి. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశం వుంది. కానీ మ‌న తెలుగు సినిమాల‌పై ప్ర‌భావం చూపేంత‌గా దీని ఓపెనింగ్స్ వుంటాయంటే అది అతే అవుతుంది.

కానీ కొంత మంది మాత్రం ప‌ని గ‌ట్టుకుని `పుష్ప‌`ని `స్పైడ‌ర్ మ్యాన్` చిత్రం దెబ్బ‌తీస్తుంద‌ని, దాని ప్ర‌భావం ఓపెనింగ్ క‌లెక్ష‌న్ ల పై ప‌డుతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదు. ఇప్ప‌టికే `పుష్ప‌` అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగానూ రికార్డు సృష్టిస్తోంది. ఓ పెనింగ్స్ కూడా భారీస్థాయిలో వుంటాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలే చెబుతున్నాయి.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి స్ట్రెయిట్ సినిమాకి డ‌బ్బింగ్ మూవీ పోటీ అంటూ `పుష్ప`ని తొక్కేయాల‌ని కొంత మంది చేస్తున్న ప్ర‌చారం త‌ప్పితే ఎక్క‌డా `స్పైడ‌ర్ మ్యాన్` క్రేజ్ `పుష్ప‌`ని మించి క‌నిపిస్తోంద‌ని చేస్తున్న ప్ర‌చారం కొంత మంది కావాల‌ని జ‌స్ట్ సృష్టించిన రూమ‌రే కానీ అది నిజం కాదు.. కాలేదు.

మ‌న మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలు దెబ్బ‌తీయ‌డం ఏంటీ?.. తియ్య‌గ‌ల స‌త్తా వాటికి వుందా? .. కామెడీ కాక‌పోతే.. అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు బ‌న్నీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News