అక్కినేని ఫ్యామిలీలో నాగ్ తర్వాత సామ్ దే హవా...!

Update: 2020-07-30 07:30 GMT
టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే నటుల్లో ఒకరైన నటసామ్రాట్ నాగేశ్వరరావు లెగసీని ఇప్పుడు ఆయన వారసుడు నాగార్జున కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన 'కింగ్' నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద 'కింగ్' అనిపించుకున్న నాగ్ స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా చూపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే నాగ్ రేంజ్  హిట్స్ అందుకొని ఎవరూ స్టార్ హీరోలు అనిపించుకోలేకపోయారు.

కాకపోతే వారిలో నాగ చైత‌న్య పర్వాలేదనిపిస్తున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటూ అక్కినేని కాంపౌండ్ ని లీడ్ చేస్తున్నాడు. ఇక అక్కినేని మరోవారసుడు అఖిల్ ట్రాక్ లోకి ఎక్కాలని తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాపై కాన్ఫిడెంటుగా ఉన్నాడు. మరోవైపు అక్కినేని కోడలు సమంత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కినేని నటన వారసత్వాన్ని సమంతనే కాపాడుతోందనే కామెంట్స్ ఫిల్మ్ మీడియా సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నిజానికి అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తరువాత అంతటి స్టార్ రేంజ్ హిట్స్ సమంత ఖాతాలోనే ఉన్నాయి. అందులోనూ సోలో గానే సూపర్ హిట్స్ దక్కించుకుంది. అటు అక్కినేని కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు సినిమాలతో బిజీగా గడుపుతోంది. వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలా చూసుకున్నా అక్కినేని వారి ఇంట నాగ్ తర్వాత సామ్ దే హవా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News