'పాన్ ఇండియా' ఫేమ్ కోసమే 'మెగాస్టార్'కి నో చెప్పిందా..??

Update: 2021-01-04 09:30 GMT
గతేడాది 'అల వైకుంఠపురంలో' సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత సుకుమార్ - బన్నీ కాంబినేషన్ హ్యాట్రిక్ సినిమాగా పుష్ప చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులలో, సినీ వర్గాలలో పుష్ప పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనేసరికి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అంటూ టాక్ వినిపిస్తుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే హీరోయిన్ రష్మిక మందన చిత్తూరు అమ్మాయిగా అక్కడి వేషబాషలతో కనిపించనుంది.

ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ తో ఫుల్ వైరల్ అవుతున్న పుష్ప సినిమా గురించి ఏ వార్త వినిపించినా ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి ఒక చెల్లెలి పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో నటించేందుకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఓకే చెప్పిందని సమాచారం. ఈ భామ ఇప్పటికే నాగచైతన్య సరసన లవ్ స్టోరీ, రానా సరసన విరాటపర్వం సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా ఆచార్య సినిమాలో రాంచరణ్ జోడిగా సంప్రదిస్తే కాదని చెప్పి అల్లు అర్జున్ పుష్పలో ఓకే చెప్పిందట. మరి ఆచార్య సినిమా ఎందుకు కాదందో తెలీదు గాని.. ఆచార్య తెలుగు వరకే పరిమితం అని, పుష్ప అయితే పాన్ ఇండియా రేంజిలో క్రేజ్ వస్తుందని ఇలా చేసినట్లు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి సాయిపల్లవి నుండి ఏం జవాబు రానుందో..!
Tags:    

Similar News