ఆర్జీవీ అలాంటి వాటికి భయపడేనా...?

Update: 2020-07-31 06:30 GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీసినా ఆదరించే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. ఈ క్రమంలో బోల్డ్ కంటెంట్ తో వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ స్టోరీస్ తో సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 'పవర్ స్టార్' అనే వివాదాస్పద టైటిల్ తో సినిమా తెరకెక్కించి సంచలనం రేపాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఓడిపోయిన అనంతరం స్టోరీ అని ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమా రూపొందించారు వర్మ. దీనికి తోడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీద ఆర్జీవీ సెటైరికల్ గా 'బావ రాజ్యం' అనే మూవీ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ (CBEN) - లాకేష్ - WHY S జగన్ - KCAR - KTAR తో పాటు పోలీసులు గ్యాంగ్ స్టర్స్ ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్మని కంట్రోల్ లో పెట్టాలని టాలీవుడ్ ప్రముఖులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కాగా రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోని వ్యక్తులను ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తూ ఇలా సినిమాలు తీయడం టాలీవుడ్ లోని కొందరు వ్యక్తులు భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు వర్మతో ఈ విషయం గురించి మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలు తీయడం ఆపకపోతే ఇండస్ట్రీ తరపున వర్మపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ఆర్జీవీ తన సినిమాలను సొంత ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసుకొని విడుదల చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ తో సంబంధం లేదు. కాబట్టి వర్మపై చర్యలు తీసుకునే ఆస్కారం లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ మీద టాలీవుడ్ లో బ్యాన్ విధించాలని చూస్తున్నారంట కదా అని అడుగగా.. ''తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాకు ఏ సంబంధం లేదు.. నేను నా ఆర్జీవీ ఇండస్ట్రీని నడుపుతున్నాను.. నా టెక్నిషయన్స్ యాక్టర్స్ నా థియేటర్స్ నా ఇష్టం'' అని చెప్పుకొచ్చారు. ఆర్జీవీ బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు తనకి తాను అలాంటి సినిమాలు తీయకూడదని నిర్ణయించుకుంటే తప్ప అతనిని ఎవరూ ఆపలేరని చెప్పవచ్చు.
Tags:    

Similar News