పవన్.. బండ్ల మూవీ దర్శకుడు ఆయనేనా?
పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా నిర్మించబోతున్నట్లుగా బండ్ల గణేష్ ప్రకటించాడు. పవన్ ఓకే చెప్పారంటూ బండ్ల గణేష్ చెప్పినప్పటి నుండి వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఇప్పటికే వకీల్ సాబ్ లో నటిస్తుండగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను కన్ఫర్మ్ చేశారు. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా బాబీ దర్శకత్వంలో మరో సినిమాను పవన్ చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో బండ్ల గణేష్ నిర్మించబోతున్న సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది ఎవరు అనే విషయంలో మీడియా సర్కిల్స్ లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుందట. ఇప్పటికే పూరి పవన్ ల కాంబినేషన్ లో బద్రి మరియు కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో మూడవ సినిమా రాబోతుంది. పూరితో ఇప్పటికే బండ్ల గణేష్ ఇద్దరమ్మాయిలతో సినిమాను నిర్మించాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ పూరిల కాంబో సినిమాను బండ్ల గణేష్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా పవన్ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ కు పవన్ హాజరు అవ్వబోతున్నాడు.
వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాను చేసేందుకు పవన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసి 2022లో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ సినిమా చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు విజయ్ దేవరకొండ మూవీతో పాటు మరో సినిమాను కూడా పూరి సినిమాలు చేయబోతున్నాడు. పవన్.. పూరిల కాంబోలో వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా మరోటి యావరేజ్ గా నిలిచింది. మరి మూడవ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.