నిర్ణయాన్ని మార్చుకున్న పవన్
కరోనా మహమ్మారి కారణంగా ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ పూర్తిగా నిలిచి పోయాయి. లాక్ డౌన్ తర్వాత జూన్ నుండి షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా కూడా ఒకటి రెండు సినిమాలు మినహా ఎక్కువ శాతం షూటింగ్ ప్రారంభం కాలేదు. కరోనా భయంతో ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న స్టార్స్ ఇక బయటకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఈ నెలలో చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఇదే నెలలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ లేకుండా షూటింగ్ చేస్తున్న దర్శకుడు వేణు శ్రీరామ్ అతి త్వరలో పవన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు అంటూ పేర్కొన్నాడు. డిసెంబర్ కంటే ముందే సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ఒకానొక సందర్బంగా మాట్లాడుతూ డిసెంబర్ వరకు షూటింగ్ లో పాల్గొనను అన్నట్లుగా చెప్పారు. షూటింగ్ అంటే ఎంతో మంది పాల్గొంటారు. వారిలో ఏ ఒక్కరికి అనారోగ్యం అయినా కూడా మంచిది కాదన్నట్లుగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు అందరు షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా వచ్చే నెల నుండి ఆర్‌ఆర్‌ఆర్ వంటి బిగ్గెస్ట్ సినిమాల షూటింగ్స్ కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి. కనుక తాను కూడా డిసెంబర్ వరకు వెయిట్ చేయడం సరైనది కాదు అన్నుకున్నారో లేదా మరేంటో కాని పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చకుని డిసెంబర్ కు ముందే అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. కనుక కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉండే అవకాశం ఉంది. అంతా సరిగా ఉండి థియేటర్లు నడిస్తే వకీల్ సాబ్ ను సంక్రాంతికి విడుదల చేయడం పక్కా అనిపిస్తుంది.