• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ మళ్లీ వేలు...

పవన్ మళ్లీ వేలు పెడుతున్నాడా?

By - Tupaki Desk
Update: 2021-06-26 10:30 GMT
పవన్ కళ్యాణ్‌.. హరీష్‌ శంకర్ ల కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ గా నిలిచిన గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవ్వబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు. మంచి సోషల్ మెసేజ్ తో పాటు ఈ సినిమా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటాయని అంటున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ లో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తో మొదలుకుని పలువురు రచయితలు కూడా పాలు పంచుకున్నారు. ఇక ఈ సినిమా కథ గురించి ప్రస్తుతం మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ లో పవన్ కళ్యాణ్‌ భాగస్వామ్యం కూడా ఉందట. కథలో కీలక పాయింట్స్ ను పవన్‌ కళ్యాణ్ ఇచ్చాడని.. పవన్ ఇచ్చిన ఇన్ పుట్స్ మరియు సలహాలు సూచనల మేరకు దర్శకుడు మరియు ఇతర రచయితలు కథను సిద్దం చేశారంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కథ విషయంలో జరుగుతున్న ప్రచారం ఒక వర్గం ప్రేక్షకులకు కలవర పాటుకు గురి చేస్తోందట. పవన్‌ కళ్యాణ్ కథ విషయంలో వేలు పెడితే ఆ సినిమాల ఫలితాలు తారు మారు అవుతాయనే టాక్‌ ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్‌ విషయంలో అదే జరిగింది అనేది కొందరి వాదన. కాని పవన్ కళ్యాణ్‌ తన ప్రతి సినిమా విషయంలో కూడా ఏదో ఒక సమయంలో దర్శకులకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. అయినా ఎక్కువగా మంచి విజయాలను దక్కించుకున్నాయి. కనుక ఈ సినిమా విషయంలో ఇప్పటి నుండే ఆందోళన అవసరం లేదని కొందరు అభిమానులు ధీమాగా పవన్.. హరీష్‌ ల మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • gabbar singh 
  • Pawan kalyan 
  • Harish Shankar 
  • Pspk28 
  • Pawan Kalyan New Movie 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS