'లవ్ స్టోరీ' స్టోరీ లైన్ 'రాజా' కథను పోలి ఉంటుందా..?
'ఆనంద్' 'లీడర్' 'గోదావరి' 'హ్యాపీడేస్' 'ఫిదా' వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ప్రస్తుతం యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ''లవ్ స్టోరీ'' అనే ఫీల్ గుడ్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
'లవ్ స్టోరీ' సినిమా స్టోరీ లైన్.. నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ 'రాజా' మూవీని పోలి ఉంటుందట. 'రాజా' సినిమాలో వెంకటేష్ కష్టపడి హీరోయిన్ సౌందర్యని పెద్ద సింగర్ ని చేసినట్లుగా.. ఇందులో సాయి పల్లవిని చైతూ డ్యాన్సర్ ని చేస్తాడట. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కాగా, 'లవ్ స్టోరీ' చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని కీలక పాత్రలు పోషించారు. వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.