నిర్మాతగా మారబోతున్న మరో దర్శకుడు

Update: 2020-06-15 06:30 GMT
టాలీవుడ్‌ లో ఇప్పటికే చాలా మంది హీరోలు దర్శకులు నిర్మాతలుగా మారిన విషయం తెల్సిందే. తమ బ్రాండ్‌ వ్యాల్యూను పెట్టుబడిగా పెట్టి ఇతర నిర్మాతలతో చిన్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. నిర్మాతలుగా మారిన దర్శకుల జాబితాలో హరీష్‌ శంకర్‌ కూడా చేరబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఈయన గతంలోనే ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇప్పుడు హరీష్‌ శంకర్‌ నిర్మాత అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈసారి బన్నీ వాసుతో కలిసి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని త్వరలోనే ఈ జాయింట్‌ వెంచర్‌ ను పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది. గీతా ఆర్ట్స్‌ 2 మరియు హరీష్‌ శంకర్‌ ల కాంబో మూవీ అంటే ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉండే అవకాశం ఉంది. కనుక సినిమాకు మినిమం బిజినెస్‌ పక్కాగా అవ్వడం ఖాయం అంటూ అప్పుడే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ లో ఉన్నాడు. క్రిష్‌ తో పాటు మరికొందరు రచయితలతో కలిసి పవన్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా ఇటీవలే హరీష్‌ శంకర్‌ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. పవన్‌ వకీల్‌ సాబ్‌ మరియు క్రిష్‌ దర్శకత్వంలో సినిమాలు పూర్తి చేసిన తర్వాత హరీష్‌ శంకర్‌ మూవీని చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కి 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News