'మానాడు' రీమేక్ కు అంతా రెడీనా?
ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన మూవీస్ ని తెలుగు స్టార్స్ తో ఈ మధ్య రీమేక్ లు చేయడం అనేది ఈ మధ్య మరీ ఎక్కువవుతోంది. 'అప్పనుమ్ కోషియుమ్' ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'భీమ్లానాయక్'గా రీమేక్ చేయడం, ఆ తరువాత 'లూసీఫర్' ని మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ పాదర్'గా తెరకెక్కించడం తెలిసిందే. ఇదే పంథాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కూడా తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది.
తమిళంలో శింబు హీరోగా ఏస్.జె. సూర్య కీలక పాత్రలో రూపొందిన మూవీ 'మానాడు'. కల్యాణి ప్రయదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. విచిత్రమైన స్క్రీన్ ప్లేతో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయాన్ని సాధించింది. హీరోగా శింబు కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టింది. 2021, నవంబర్ 25న విడుదలైన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.
తెలుగు రీమేక్, డబ్బింగ్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొనడంతో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు దాదాపు 12 కోట్లకు ఈ మూవీ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నారు. నాగచైతన్య కూడా ఈ మూవీ రీమేక్ హక్కుల కోసం ట్రై చేసి చివరి నిమిషంలో విరమించుకోవడం తెలిసిందే.
అయితే ఈ మూవీని మాస్ మహారాజా రవితేజ, డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో రీమేక్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసింది.
శింబు క్యారెక్టర్ లో సిద్దూ జొన్నలగడ్డ నటించనుండగా ఏస్.జె.సూర్య క్యారెక్టర్ లో మాస్ మహారాజా రవితేజ నటించనున్నారట. అత్యంత భారీ స్థాయిలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడు.
ఇప్పటికే కథలో తెలుగు నేటి విటీ కోసం మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టిన ప్రవీణ్ సత్తారు త్వరలోనే పూర్తి చేసి సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడట.
ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం వరుణ్ తేజ్ తో 'గాండీవధారి అర్జున' అనే స్పై థ్రిల్లర్ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. త్వరలోనే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.